What is Multilevel Marketing in Telugu? (MLM గురించి తెలుగులో)

What is Multilevel Marketing in Telugu? (MLM గురించి తెలుగులో)

Multi Level Marketing in Telugu: మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా నెట్‌వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి? దాని ద్వారా ఎక్కవ డబ్బు సంపాదించటం ఎలా? మరియు దాని ఇతర రహస్యాలు గురించి మీరు తెలుగులో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు multi level మార్కెటింగ్‌ సంబందించిన ఈ పోస్టును ఖచ్చితంగా చదవాల్సిందే. ఈ పోస్టు ద్వారా మేము మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు సంబందించిన ముఖ్యమైన విషయాలు అందించబోతున్నాము.

multilevel-marketing-in-telugu

What is Multilevel Marketing in Telugu? (MLM గురించి తెలుగులో)

Multi Level Marketing (MLM) ను నెట్‌వర్క్ మార్కెటింగ్ అని కూడా పిలుస్తారు. అయితే వాడుక భాషలో దీనికి అనేక పేర్లు వచ్చాయి. కొంతమంది Chain System Business అని కొంతమంది పిరమిడ్ స్కీమ్ అని పిలుస్తారు.

కానీ పిరమిడ్ స్కీం అనేది ఒక మోసపూరితమైన బిజినెస్ మోడల్ అనే చెప్పాలి. MLMకు pyramid schemeకు దగ్గర పోలికలు వున్నా, పిరమిడ్ స్కీం ముఖ్య ఉద్దేశం డబ్బు, ఇందులో ఎటువంటి నాణ్యత కలిగిన లేదా విలువైన వస్తువులు అమ్మరు.

ఉద్దహరణ: Multi Level Marketing (MLM) కంపెనీలు కొన్ని విలువైన వస్తువులు అమ్మితే, పిరమిడ్ scheme కంపెనీలు online డిగ్రీలు, కోర్సులు లాంటివి అమ్ముతాయి. ఇలాంటి కోర్సులు, డిగ్రీలు దేనికి పనికిరావు అని తెలుసుకోవటం ఎంతైనా ముఖ్యం.

మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

ఒక కంపెనీ తయారు చేసిన వస్తువుల యొక్క వినియోగదారులతోనే మరికొన్ని వస్తువులు డైరెక్ట్ సెల్లింగ్ పద్దతిలో అమ్మేలా చేయటమే నెట్వర్క్ మార్కెటింగ్.

నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో, వ్యక్తులు నేరుగా సంస్థలతో లావాదేవీలు నడుపుతారు మరియు వస్తువులను (ఉత్పత్తులను) వినియోగదారునికి అందిస్తారు. నిజం చెప్పాలి అంటే, నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారంలో చాలా శక్తి ఉంది, దీని ద్వారా చాలా మంది ప్రజలు కోటీశ్వరులు అయ్యారు, అయితే మరికొంతమంది పూర్తిగా మోసపోయారు. అది ఎలాగో చూద్దాం.

అనుమానాలు/ అపోహలు

Multi Level Marketing (MLM) లో చేరబోయే వారికి అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. ఈ రోజు మేము ఈ పోస్ట్‌లో ఇలాంటి అనేక రకాల నెట్‌వర్క్ మార్కెటింగ్‌పై మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాము, ఇది మీకు నెట్‌వర్క్ మార్కెటింగ్ వ్యాపారాన్ని అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

  • Multi Level Marketing (MLM) పెద్ద కుంభకోణమా?
  • MLM ద్వారా కంపెనీలు దోచుకుంటున్నాయా?
  • నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీలో చేరవచ్చా?

వీటన్నిటికీ సమాధానం:

నెట్‌వర్క్ మార్కెటింగ్ లేదా MLM అనేది కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించే ఆలోచనాత్మకమైన వ్యాపార ప్రణాళిక. అయితే కొన్ని మోసపూరిత నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థల కారణంగా, నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరు చెడింది. కొన్ని MLM కంపెనీలు ప్రజల డబ్బును దోచుకోవడం ద్వారా చాలా పెద్ద స్కామ్  చేసాయి, దీని వలన అన్ని నెట్‌వర్క్ మార్కెటింగ్ కంపెనీల పేరు దెబ్బతిన్నది. అలాగే MLMలో విఫలమైన వ్యక్తులు, ఆయా సంస్థల గురించి ప్రతికూలంగా మాట్లాడటం సహజం మరియు వారు విజయవంతం కాలేదు కాబట్టి దానిని ఖండిస్తారు.

MLMలో మోసపూరిత కంపెనీలు ఉన్నాయా?

చాలానే ఉన్నాయని చెప్పాలి. ఒక సంస్థ విజయవంతమైన తరువాత దాని యొక్క మార్కెటింగ్ strategy ని దొంగిలించి వేరే సంస్థ నెలకొల్పి చాలా కంపెనీలు ప్రజలను మోసం చేశాయి. అయితే ఎవరైనా mlm లో చేరాలి అనుకుంటే మాత్రం కంపెనీ యొక్క హిస్టరీ, బిజినెస్ స్ట్రాటజీ, బిజినెస్ లీడర్స్, products గురించి ముందుగా తెలుసుకోవాలి. మరీ ముక్యంగా తెలుసుకోవాల్సింది ఆ కంపెనీ పై ఇప్పటివరకు ఏమన్నా తప్పుడు ఆరోపణలు లేదా పోలీస్ కేసులు ఉన్నాయా లేదా అని.

యమ్ ఎల్ యమ్ మార్కెటింగ్ లో మంచి కంపెనీలను ఎలా ఎంచుకోవాలి?

ఒక కంపెనీ యొక్క వ్యాపారంలో బాగస్వామి అవ్వాలి అంటే ముందుగా కంపెనీ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి. ఆ కంపెనీ తయారు చేసే ఉత్పత్తుల వివరాలు సేకరించాలి. ఆయా ఉత్పత్తులు జనాలకు ఎంత వరకు ఉపయోగపడతాయి మరియు వాటిని ఉపయోగించిన వ్యక్తుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే మనకు ఆ కంపెనీ పట్ల విశ్వాసం కలుగుతుంది.

Top MLM Companies in India (Multi Level Marketing in Telugu)

  • Herballife Nutrition
  • Amway India
  • Forever Living
  • Avon Products
  • Modicare
  • RCM Business
  • Vestige

Pyramid Scheme vs MLM

MLMకు pyramid schemeకు దగ్గర పోలికలు వున్నా, పిరమిడ్ స్కీం ముఖ్య ఉద్దేశం chain system ను పెంచటం. పిరమిడ్ కంపెనీస్ లో ఎటువంటి నాణ్యత కలిగిన లేదా విలువైన వస్తువులు అమ్మరు.

Ex: MBA, online డిగ్రీలు, కోర్సులు, software’s, tools లాంటివి చూపించి, జనాలను చేర్పించమనే కంపెనీలు Pyramid Scheme క్రిందకే వస్తాయి. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.

Multi Level Marketing భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

ముక్యంగా ఇండియాలో చూస్తే MLM కొన్ని రంగాల వారికి (ఆంటే Online లో కొనలేని వాటికి) బాగానే వుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ ప్రభావంతో ఇది కొంతవరకు బలహీనపడింది. భవిషత్తు అంతా డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Also, Read:

Leave a Comment