How to Earn Money Online in Telugu ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం ఎలా?

How to Earn Money Online in Telugu?: మీరు ఇంట్లో కూర్చుని ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా! అయితే పెట్టుబడి లేకుండా ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం పై ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వటం జరిగింది. ఆసక్తి వున్న వారు పూర్తిగా చదవండి. ఇక్కడ తెలుపబడిన అన్ని మార్గాలు కేవలం ఆన్లైన్ ద్వారా చేయగలిగినవి మాత్రమే. కావున మీ దగ్గర కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉండాలి.

how-to-earn-money-online-in-telugu

How to Earn Money Online in Telugu ఆన్లైన్ లో డబ్బు సంపాదించడం ఎలా?

ఇంటర్నెట్ లో ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించటం అనే విషయం పైన చాలా కోర్సులు ఉన్నాయి. అందులో బ్లాగింగ్, affiliate marketing, Freelancing లాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే వీటిలో సక్సెస్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది అలాగే ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అందుకే చాలా మంది ఇందులో ఫుల్ టైం పని చేయడానికి ఇష్టపడరు. అయితే passive income కావాలి అనుకునే వారికి Online మంచి వేదిక అని చెప్పాలి. ఈ పోస్టులో How to Earn Money Online in Telugu అనే టాపిక్ గురించి తెలుసుకుందాం.

ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ లో డబ్బు సంపాదించవచ్చా?

ఈ సందేహం మీకు రావటం సహజం. నిజం మాట్లాడుకుంటే ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించటం అనేది చాలా కష్టమైన పనే. వీటికి తోడు Online లో డబ్బు సంపాదించాలని అనుకునే వారికి కొన్ని అర్హతలు కూడా ఖచ్చితంగా ఉండాలి. అవి ఏమిటంటే కంప్యూటర్ పరిజ్ఞానం, వేగంగా నేర్చుకోగలగటం, ఓపిక. ఈ మూడు అర్హతలు వున్న వారు ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించగలరు.

ఓపిక అనేది ఆన్లైన్ లో పని చేసే వారికి చాలా అవసరం. కొంతమంది 3 నెలలో సక్సెస్ అయితే మరికొంతమందికి 1 సంవత్సరం పట్టొచ్చు. ఏదేమైనా అది మీ స్కిల్స్ మీద ఆదారపడి ఉంటుంది.

Google Adsense గూగుల్ యాడ్సెన్స్

Google Adsense అనేది ఒక యాడ్ నెట్వర్క్ కంపెనీ. మీకు ఆన్లైన్ లో ఏమన్నా websites/Blogs లేదా చానెల్స్ వుంటే అందులోని కొంత భాగాన్ని Adsense కి అమ్మొచ్చు. అక్కడ కనబడే యాడ్స్ మీకు ఆదాయ వనరుగా మారుతుంది. దీనికోసం మీలో content create చేయగల సత్తా ఉండాలి. ఇక్కడ content అంటే కొత్తగా మరియు సొంతగా English లో లేదా తెలుగులో వ్రాయగలగటం లేదా ఇంటర్నెట్ లో దొరికే software tools ఉపయోగించి videos చేయగలగడం.

ఇంగ్లీష్ లేదా తెలుగులో కంటెంట్ వ్రాయటం వలన మీరు ఒక Website/Blog ని create చేసి దానికి Google Adsense ని అనుసంధానం చేయవచ్చు. Video Editing తెలిసిన వారు YouTube లో మంచి videos పెట్టి Adsense ద్వారా డబ్బు సంపాదించవచ్చును. ఈ రెండూ వేరు వేరు మార్గాలయినా డబ్బు మీకు వచ్చేది Google Adsense నుంచే. Content create చేయలేని వారు క్రింద కనిపించే మార్గాల గురించి ఆలోచించండి.

Affiliate Marketing

Google Adsense తో పోల్చుకుంటే Online లో ఎక్కువ డబ్బులు సంపాదించగల మార్గం Affiliate Marketing. దీనికి ప్రత్యేకంగా అర్హతలు అంటూ ఏమీ లేవు. Amazon, Flipkart లాంటి E commerce వెబ్సైట్లు వాటి products ని Affiliate Marketing చేసే వారికి మంచి వేతనాలు ఇస్తున్నాయి. ఇవే కాక అనేక Insurance కంపెనీలు, Real Estate కంపెనీలు మరియు World Class కంపెనీలు అమ్మబడిన ప్రతి ఒక్క product కి కనీసం 8% ఆ product rate లో నుంచి అమ్మిపెట్టిన వారికి ఇస్తున్నాయి. ఉదాహరణకు మీరు amazon లో లభించే 30,000 ఖరీదు చేసే ఒక laptop ని మీ అమెజాన్ affiliate link ద్వారా ఎవరైనా కొనేలా చేస్తే మీకు 2000 రూపాయలు వరకు అమెజాన్ చెల్లిస్తుంది.

Online Tutor Jobs

మీరు మీ అకడెమిక్స్ లో ఏదైనా subject మీద మంచి knowledge కలిగివున్నారా? అయితే మీరు Online Tutoring ద్వారా నెలకు కనీసం 15,000 సంపాదించవచ్చు. Maths, Physics, Chemistry, Commerce లాంటి subjects మీద పట్టు వున్న వారికి మంచి అవకాశాలు వున్నాయి. దీనికి మీరు Online లో ముందుగా ఆ subject కి సంబందించిన exam qualify అవ్వవలసి ఉంటుంది.

Online Speech Recognition/ Translation Works

మీ దగ్గర మంచి Laptops, ఫోన్స్ లేదా టాబ్లెట్స్ వున్నాయా? అయితే మీరు Online నుంచి Speech Recognition/ Translation Works చేయవచ్చు. ఈ works చేసే వారికి కంపెనీలు ఎక్కువ డబ్బులే చెల్లిస్తాయి. ఇంగ్లీష్, హిందీ రాయటం, చదవటం వచ్చిన వారికి మంచి అవకాశాలు వున్నాయి. Appen అనే కంపెనీ ఈ రకమైన Online jobs అందించటం లో ప్రసిద్ధి చెందింది.
Website Link: Appen Connect

Freelancing

మీలో వున్న స్కిల్స్ ద్వారా డబ్బు సంపాదించుకునే మార్గం Freelancing.  మీకు నేర్చుకున్న skills ఏవైతే ఉన్నాయో వాటిని freelancing websites లో నమోదు చేయాలి. అవసరం వున్న వారు మీతో పని చేయుంచుకుని డబ్బు చెల్లిస్తారు. ఇదంతా Online ద్వారానే జరుగుతుంది. Fiverr, Upwork Freelancer గా పనిచేయడానికి మంచి వెబ్ సైట్లు.

Data Entry

డేటా ఎంట్రీ చాలా కఠినంగా వుండే ఒక ఆన్లైన్ వర్క్. పైగా ఇందులో డబ్బు సంపాదించటం చాలా కష్టమైన పని. ఎంతో శ్రమ పడితేగాని ఒక మోస్తారు ఆదాయం వస్తుంది. అయితే నిరుద్యోగుల కోసం డేటా ఎంట్రీ వర్క్ పని కల్పించడానికి భారత ప్రభుత్వం ఒక website రూపొందించింది.
ఇది కాకుండా Online లో చాలా websites వున్నాయి. ఒకసారి చూడగలరు.

Online Surveys

ఒక ప్రోడక్ట్ లేదా software యొక్క వినియోగాన్ని టెస్ట్ చేయడానికి online లో కొన్ని సర్వేలు నిర్వహిస్తారు. ఒక్కో సర్వేకు కనీసం 2 నుంచి 5 డాలర్లు ఇస్తారు. ఇది చాలా తేలికైనా పని లభించడం మాత్రం కొంచం కష్టం.
Website: Survey Monkey

Leave a Comment