Learn Blogging in Telugu for Free (Blogger/WP Tutorial)

Blogging in Telugu for Free: ఆన్లైన్ వేదికగా డబ్బు సంపాదించవచ్చా? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది. చాలామంది దానిని నిరూపించి చూపించారు. ఆయితే కొంత మంది మాత్రం దానిని సాకారం చేసుకునే క్రమంలో చాలా ఒడిదుడుకులు పడతారు. అటువంటి వారికి ఈ పోస్ట్ సహాయ పడుతుందని ఆశిస్తున్నాము. ఆన్లైన్ లో డబ్బు సంపాదించాలంటే కొంచం సులభమైన మార్గం బ్లాగింగ్ అనే చెప్పాలి.

Learn Blogging in Telugu for Free (Blogging Tutorial తెలుగులో)

What is the Meaning of Blog in Telugu ?(బ్లాగ్ అంటే ఏమిటి?): ఒక వ్యక్తి లేదా చిన్న సమూహం చేత Online వేదికగా క్రమం తప్పకుండా వాడుక భాషలో వ్రాయబడే ఒక అనధికారిక సంభాషణలు లేదా ఆర్టికల్స్.

learn-blogging-in-telugu

మీ బ్లాగింగ్ కోసం సరైన భాషను ఎంచుకోండి

బ్లాగింగ్ మొదలు పెట్టటానికి చాలా మంది వెనకడుగు వేయటానికి కారణం భాష. అయితే బ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించాలంటే ముందుగా ఒకరు తెలుసుకోవాల్సింది, నేను ఏ భాషలో నైపుణ్యం కలిగి వున్నాను అని. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను బ్లాగింగ్ కి పనికిరాని అనే  ఒక అపోహలో చాలా మంది వుంటారు. కానీ తెలుగులో కూడా బ్లాగింగ్ మొదలు పెట్టి సక్సెస్ అయినా వారు చాలా మంది వున్నారు.

మీరు ఎటువంటి టాపిక్ (niche)లో నిష్ణాతులు?

మీరు ఇంగ్లీష్ లేదా తెలుగులో ఒక బ్లాగు మొదలు పెట్టాలి అనుకున్నారు. ఆ తర్వాత మీకు ఎదురయ్యే ప్రశ్న ఏ టాపిక్ మీద బ్లాగ్ మొదలు పెట్టాలి అని. బ్లాగ్ టాపిక్స్ ని ఇంగ్లీష్ లో niche అంటారు. మీరు ఏ niche లో మొదలుపెట్టాలో మీకు ఒక ఐడియా ఖచ్చితంగా ఉండాలి. అదే బ్లాగు యొక్క మొదటి సక్సెస్ సీక్రెట్. చాలా మంది అన్ని టాపిక్స్ ని కలిపి ఒక బ్లాగులో మొదలు పెట్టేస్తారు. ఇది తప్పేమి కాదు. అయితే తొందరగా సక్సెస్ అవ్వాలి అంటే ఒక టాపిక్ (niche) ముందుగా ఆలోచింకోవటం మంచిది. మీకు బాగా ఇష్టమైన లేదా క్రమం తప్పకుండా ఎదో ఒక దాని గురించి ఆలోచిస్తారు కదా, దానిని మీ టాపిక్ గా మార్చుకోవటమే మీ సక్సెస్.

ఉదాహరణ: శ్రీనివాస్ రోజు పేపర్ చూడగానే స్పోర్ట్స్ కాలమ్ లోకి వెళ్తాడు. అంటే శ్రేనివాస్ కి బాగా పట్టు వున్న టాపిక్ స్పోర్ట్స్ అనమాట. ఇప్పుడు శ్రీనివాస్ స్పోర్ట్స్ మీద ఒక బ్లాగు మొదలు పెట్టొచ్చా అంటే ఖచ్చితంగా మొదలు పెట్టొచ్చు. అయితే అందులో శ్రీనివాస్ నిష్ణాతుడై ఉండాలి.

బ్లాగ్ రీసెర్చ్

Niche ఎంచుకున్న తర్వాత మీరు చేయవలసింది research. మీకు ఇష్టమైన టాపిక్ మీద ఆన్లైన్ లో ఎన్ని బ్లాగ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. వాటితో టాప్ ఏవి, ఆ బ్లాగుల మాదిరిగా రోజు కంటెంట్ రాయగలనా లేదా అని మీకు మీరు ప్రశ్నించుకోవాలి. మీ మైండ్ నుంచి వచ్చే జవాబు మీ కొత్త బ్లాగుకు పునాది వేస్తుంది.

భాష (language), టాపిక్ (niche) ఈ రెండూ మీరు ఎంచుకున్న తర్వాత మీరు చేయవలసింది రీసెర్చ్. రీసెర్చ్ లో భాగంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీ టాపిక్ మీద ఎంత ట్రాఫిక్ వుంది?, మీరు అనుకున్నట్టుగా వేరే బ్లాగ్స్ ఎన్ని వున్నాయి?. వాటి ఆదాయం ఎంత?, ఆ బ్లాగ్స్ లో కంటెంట్ ఎలా వుంది? వీటి జవాబుల కోసం ఆన్లైన్ లో శోదించాలి.

బ్లాగింగ్ వేదికలను ఎలా ఎంచుకోవాలి? (Select your Blogging Platform)

Online వేదికగా బ్లాగర్స్ కోసం చాలా Blogging Platforms అందుబాటులో వున్నాయి. అందులో కొన్ని ఉచితంగా సేవలను అందిస్తుంటే మరికొన్ని వాటిని వినియోగించాలంటే డబ్బు చెల్లించవలసిన అవసరం వుంది. ఏది ఏమైనా తెలుగులో లేదా ఇంగ్లీష్ లో ఒక బ్లాగ్ ఉచితంగా మొదలుపెట్టవచ్చు లేదా కనీసం ఒక సంవత్సరానికి 2000 తో డొమైన్ మరియు హోస్టింగ్  కొనుక్కుని మీ బ్లాగును మొదలుపెట్టొచ్చు.

ఉచిత బ్లాగింగ్ ప్లాటుఫార్మ్స్ (Free Blogging Platforms in Telugu)

ఉచితంగా సేవలు అందించే బ్లాగింగ్ వేదికలు చాలా వున్నాయి. అయితే డబ్బు ఏమీ పెట్టకుండా డబ్బు సంపాదించాలి అంటే ఏకైక blogging platform మాత్రం బ్లాగర్. ఏమైనప్పటికీ ఆ ఉచితాలు ఏంటో చూద్దాం.

  • బ్లాగర్ (Blogger)
  • వర్డ్ ప్రెస్ (WordPress)
  • టంబ్లర్ (Tumbler)
  • జుమ్లా (Zoomla)
  • విక్స్  (Wix)
  • స్ట్రైకింగ్ల్లీ (Strikingly)

ఇలా చాలా ఉచితంగా హోస్టింగ్ అందించే బ్లాగింగ్ ప్లాటుఫార్మ్స్ వున్నాయి. అందులో గూగుల్ యొక్క బ్లాగర్ ద్వారా మాత్రమే కొంచెం సులభముగా డబ్బు సంపాదించవచ్చు. మిగిలిన వాటితో మీరు ఏ విధమైన ఆదాయం ఆశించకుండా బ్లాగింగ్ చేయవచ్చు.

పైడ్ బ్లాగింగ్ (Paid Platforms for Blogging in Telugu)

మీరు బ్లాగర్ లో కాకుండా మీ సొంతగా హోస్టింగ్ కొనుక్కోవాలి అంటే మీరు క్రింద కనబడే ప్లాటుఫార్మ్స్ ను ఎంచుకోవాలి.  అయితే వీటిలో ఎక్కువ మంది బ్లాగర్స్ వాడేది మాత్రం వర్డ్ ప్రెస్.

  • వర్డ్ ప్రెస్ (WordPress)
  • జుమ్లా (Zoomla)
  • విక్స్ (Wix)
  • పైథాన్ (Python)
  • డ్రుపాల్ (Drupal)

హోస్టింగ్ (Hosting in Telugu)

మీరు బ్లాగింగ్ ప్లాట్ఫారం నిర్ణయించుకున్న తరువాత మీరు చేయవలసింది హోస్టింగ్ (అనగా sever) సిద్ధం చేసుకోవాలి. Online లో అతి తక్కువ ధరకు వచ్చే hosting చాలానే వున్నాయి. అందులో మంచివి ఇక్కడ చూద్దాం.

  • రీసెల్లర్ క్లబ్ హోస్టింగ్ (Reseller Club)
  • బిగ్ రాక్ హోస్టింగ్ (Big Rock)
  • హోస్ట్ గేటర్ హోస్టింగ్ (Hostgator)
  • గో డాడీ హోస్టింగ్ (Godaddy)
  • బ్లూ హోస్ట్ హోస్టింగ్ (Blue Host)

ఈ కంపెనీలన్నీ అతి తక్కువ ధరలకు shared hosting ను అందిస్తాయి. మీరు బ్లాగింగ్ కు కొత్త అయితే మీరు రెసెల్లర్ క్లబ్ తీసుకోవటం ఉత్తమం. రెసెల్లర్ క్లబ్ అతి తక్కువ ధరకు హోస్టింగ్ అందించే ఒక నమ్మకమైన కంపెనీ. అలాగే బిగ్ రాక్, హోస్ట్ గేటర్ కూడా తక్కువ ధరలకు హోస్టింగ్ అందిస్తాయి. మీరు ఎంచుకున్న బ్లాగింగ్ platform ను మీకు నచ్చిన సర్వర్ లో install చేసి మీ బ్లాగింగ్ ను మొదలు పెట్టటమే తరువాతి భాగం.

How To Earn Money from Blogging in Telugu?

బ్లాగింగ్ చేయటానికి కావలసిన భాష, niche లేదా topic, బ్లాగింగ్ platform, hosting company నిర్ణయించుకున్న తరువాత, మీరు చేయవలసింది మీ టాపిక్ యొక్క కంటెంట్ ను పోస్టుల రూపంలో రోజూ అప్డేట్ చేయటమే. అలా బ్లాగింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజుల తరువాత మీ వెబ్సైటు లేదా బ్లాగ్ ను monetize (ఆదాయ వనరుగా) చేయాలి అంటే, మీరు గూగుల్ లేదా ఎదో ఒక యాడ్ నెటవర్క్ కు అప్లై చేసుకోవాలి. మీరు రాసిన కంటెంట్ ను బట్టి మరియు బ్లాగ్ ట్రాఫిక్ ను బట్టి యాడ్ networks మీ యొక్క అప్లికేషన్ ను ఆమోదిస్తాయి.

How To Create a Blogger Blog and Make Money in Telugu?

ఒక బ్లాగు ని create చేయడానికి మనకి Online లో చాలా వేదికలు మరియు పరికరాలు అందుబాటులో వున్నాయి. వాటిని ఉపయోగించుకుని ఉచితంగా లేదా డబ్బు చెల్లించి Telugu Blogs మొదలుపెటొచ్చును. ఈ పేజీ లో మీరు బ్లాగు ను నెలకొల్పడానికి కావలసిన విషయాలను గురించి తెలుసోకోవచ్చును.

Blog Meaning in Telugu / బ్లాగ్ అంటే ఏమిటి?

ఒక వ్యక్తి లేదా చిన్న సమూహం చేత Online వేదికగా క్రమం తప్పకుండా వాడుక భాషలో వ్రాయబడే ఒక అనధికారిక సంభాషణల యొక్క పర్వం.

Best Blogging Platforms (ఉత్తమ బ్లాగింగ్ వేదికలను ఎలా ఎంచుకోవాలి): Online వేదికగా బ్లాగర్స్ కోసం చాలా Blogging Platforms అందుబాటులో వున్నాయి. అందులో చాలా వరకు ఉచితంగా సేవలను అందిస్తుంటే కొన్ని వాటికి మాత్రం డబ్బు చెల్లించవలసిన అవసరం వుంది. ఏది ఏమైనా తెలుగులో లేదా ఇంగ్లీష్ లో ఒక బ్లాగ్ ఉచితంగా మొదలుపెట్టవచ్చు లేదా కనీసంగా ఒక 500 నుంచి 3000 వున్నా సరిపోతుంది. ఉచితంగా సేవలు అందించే బ్లాగింగ్ వేదికలు ఏంటో ఇక్కడ చూద్దాం.

Free and Best Blogging Platforms for Telugu Bloggers

క్రింద కనిపిస్తున్న Online Blogging వేదికల ద్వారా మీరు తెలుగులో బ్లాగ్ ఉచితంగా మొదలుపెట్టవచ్చును. ఇలాంటి వేదికలు ఇంకా చాలా వున్నాయి. అందులో ఉత్తమ Blogging Platforms మాత్రం ఇవ్వబడినది.

  • Blogger
  • Tumblr
  • WordPress
  • Medium
  • Wix
  • Flipboard
  • Strikingly
  • Joomla
  • Webnode
  • Weebly

ఉచితంగా మొదలుపెట్టగల బ్లాగ్స్ ద్వారా కొన్ని అడ్డంకులు వున్నాయి. అంతే కాకుండా వీటి వళ్ళ డబ్బు సంపాదించడం కొంత కష్టమే. పైన కనపడుతున్న ఉచిత Blogging Platforms list లో ఒక బ్లాగర్ ద్వారా మాత్రమే Adsense ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఎందుకంటే Blogger, Adsense రెండూ Google యొక్క products.

Blogger Tutorial in Telugu | ఉచితంగా బ్లాగ్

మీకు Gmail account ఉంటే చాలు. మీరు ఉచితంగా ఒక బ్లాగ్ create చేసుకోవచ్చు మరియు దాని ద్వారా డబ్బు కూడా సంపాదించవచ్చు. దీనికి మీరు కింద కనపడుతున్న లింక్ ద్వారా మొదటగా రిజిస్టర్ చేసుకోవలెను.

Blogger Link: https://www.blogger.com

ఒక బ్లాగ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అసలైన పని ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎవరైతే సొంతగా కంటెంట్ క్రమం తప్పకుండా పెడుతూ పెద్ద సంఖ్యలో రీడర్స్ లేదా subscribers ను సంపాదించుకుంటారో వారికి గూగుల్ బ్లాగర్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని కలిగిస్తుంది.

గూగుల్ ద్వారా బ్లాగర్ బ్లాగ్ సృష్టించిన తరువాత మీరు క్రింద విదంగా చేయవలసి వుంటుంది.

  • బ్లాగ్ క్రియేట్ చేసిన తర్వాత About Us, Contact Us, Privacy Policy, Disclaimer వంటి పేజీలను తప్పనిసరిగా పబ్లిష్ చేయవలెను
  • ముందుగా మీకు సముచితమైన లేదా ఇష్టమైన టాపిక్స్ ను ఎంచుకోండి (ఉదాహరణ: Cricket, Jobs, Travelling, etc.)
  • మీకు ఇష్టమైన టాపిక్ మీద కనీసం ఒక 30 పోస్ట్లు కోసం కంటెంట్ ని ముందుగానే సిద్ధం చేయండి.
  • రోజువారీ ఆ టాపిక్ మీద ఒక పోస్ట్ ను పబ్లిష్ చేయండి
  • ప్రతి పోస్ట్ లో కనీసం ఒక Image పెట్టండి
  • మీరు పబ్లిష్ చేసిన కంటెంట్ మరియు Images వేరే బ్లాగ్స్ నుంచి copy చేసింది అయి వుండకూడదు. మీరు సొంతగా వ్రాయాయవలెను.
  • మీ పోస్టులను సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో షేర్ చేయండి
  • ఇలా ఒక 30 రోజులు చేసిన తర్వాత Google Adsense కి apply చేయండి.
  • మీ బ్లాగ్ కి వస్తున్న ట్రాఫిక్ లేదా రీడర్స్ ను బట్టి మీకు గూగుల్ డబ్బు చెల్లిస్తుంది.

Also, Read: