బిట్ కాయిన్: Bitcoin in Telugu Explained

బిట్ కాయిన్: Bitcoin in Telugu Explained

Bitcoin in Telugu (బిట్ కాయిన్ గురించి తెలుగులో): ఈ పోస్టులో మనం బిట్ కాయిన్ అంటే ఏమిటి, బిట్ కాయిన్ సృష్టించింది ఎవరు? ఒక బిట్ కాయిన్ ఇండియన్ కరెన్సీలో ఎంత విలువ ఉంటుంది? బిట్ కాయిన్ కొనొచ్చా లేదా? బిట్ కాయిన్ ఎలా కొనాలి అనే వాటిపై సమాధానాలు వివరంగా తెలిపాము. కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ చూడగలరు.

Are you searching for Bitcoin in Telugu? then you are the right place to know about complete Bitcoin details in Telugu here. In this series we will let you know with the frequently asked questions about Bitcoin in Telugu like How to trade Bitcoin in India? Its uses and other related information.

bitcoin in telugu

 

What is Bitcoin Meaning in Telugu and How to Trade Bitcoin?

భారతదేశంలో క్రిప్టో కరెన్సీలు చాలానే ఉన్నాయి. వాటిలో బిట్‌కాయిన్, ఎక్స్ఆర్పీ, యూఎస్డీటీ, ఈటీహెచ్, టీఆర్ఎక్స్, యూఎన్ఐ, ఇంకా ఎన్నో క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. పలు స్టార్టప్ కంపెనీలు సైతం క్రిప్టో కరెన్సీల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. 2020 మార్చ్ నెలలో సుప్రీం కోర్ట్ cryptocurrency మీద RBI విధించిన ఆంక్షలు ఎత్రివేయడంతో మరలా కొత్త యాప్స్, Crypto Exchanges పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అసలు బిట్ కాయిన్ ఇండియాలో చలామణీ అవుతుందా లేదో ఇక్కడ తెలుసుకుందాం.

బిట్ కాయిన్ అంటే ఏమిటి, What is Bitcoin Meaning in Telugu?

ఈ బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ, దీనిని డిజిటల్ మనీ లేదా వర్ట్చువల్ కరెన్సీ అని కూడా పిలుస్తారు. ఇది మాములు పేపర్ కరెన్సీలా కాకుండా electronic రూపంలో పొందుబరిచి ఉంటుంది. అంటే దీనికి physical గా వాడుక రూపం అంటూ ఏమి లేదు పైగా చూడటానికి కుదరదు. దీనిని వినియోగించుకోవాలంటే మన దగ్గర Bit Coin wallet తప్పనిసరి.

బిట్ కాయిన్ సృష్టికర్త ఎవరు?

ఈ బిట్ కాయిన్ యొక్క సృష్టికర్త ఎవరికీ తెలీదు. అయితే మొదటగా సతోషి నకమోటో (గుర్తుపెట్టుకోండి) అనే జపానీస్ మారుపేరుతో బిట్‌కాయిన్ల గురించి 2008లో కొన్ని white papers, software, అది పని చేసే విధానం ప్రచారంలోకి వచ్చాయి. అలాగే ఇతను గురించి ఎటువంటి వివరాలు బాహ్య ప్రపంచానికి తెలియదు.

బిట్ కాయిన్ వెనుక వున్న Crypto Algorithm ఏమిటి?

బిట్ కాయిన్ cryptographic algorithm SHA-256 ను బేస్ చేసుకుని పని చేస్తుంది. ఈ SHA-256 అల్గోరిథమ్ 256-bit (32-byte) signature రూపంలో బిట్ కాయిన్ ను పొందుబరుస్తుంది. అంటే ఇది చాలా సెక్యూరిటీ కలిగి ఉంటుంది.

కొత్త బిట్ కోయిన్స్ ఎవరు విడుదల చేస్తారు?

మన ఇండియాలో కొత్తగా డబ్బును ముద్రించాలి అంటే మన Reserve Bank of India ముద్రిస్తుంది. అలాగే ఇతర దేశాలకు ఆయా బ్యాంకులు లేదా ప్రభుత్వాల జోక్యం తప్పనిసరి. కానీ బిట్ కాయిన్ currency mining చేయడానికి ఎవరి అజమాయిషి ఉండదు.

ఒక బిట్ కాయిన్ ఇవ్వడానికి ప్రత్యేక బ్యాంక్ అంటూ ఏమి లేదు. దీనిని కొన్ని కంప్యూటర్స్ సహాయంతో Bitcoin Block అనే కాన్సెప్ట్ ద్వారా విడుదల చేస్తారు. దీనిని కంట్రోల్ చేయడానికి regulatory authority అంటూ లేదు. కేవలం automatic గా ఈ బిట్ కాయిన్ మైనింగ్ పద్ధతి కొనసాగుతుంది. అంటే ఈ Bitcoin mining ను శాసించే వారు లేరనమాట.

బిట్ కాయిన్ ఎందుకు పాపులర్ అయింది?

బిట్ కాయిన్ వచ్చిన మొదట్లో దీని యొక్క విలువ కేవలం 5 రూపాయలు మాత్రమే. 2010 ఆగష్టులో ఇండియన్ కరెన్సీలో ఇది 5 రూపాయల వద్ద నుంచి ట్రేడ్ అయింది. ఆ తరువాత 2017లో ఏకంగా దాని విలువ 13 లక్షలకు చేరింది. అంటే 2010లో ఒక 50 రూపాయలు పెట్టి 10 బిట్ కాయిన్స్ కొన్నవారు 2017లో కోటీశ్వరులు అయ్యారనమాట. కానీ 2018లో బిట్ కాయిన్ విలువ మొదటి పతనానికి చేరింది. 13 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయింది. అదే సమయంలో భారత దేశంతో సహా కొన్ని దేశాలు బిట్ కాయిన్ నమ్మ దగినది కాదని, దీని వల్ల ప్రజలు మోసపోవచ్చని ప్రకటించాయి.

ఒక బిట్ కాయిన్ ఇండియన్ కరెన్సీలో ఎంత విలువ ఉంటుంది?

ప్రస్తుతం ఒక బిట్ కాయిన్ ధర ఇండియన్ కరెన్సీలో 8 లక్షల 40 వేలకు పైగా ట్రేడ్ అవుతుంది. అయితే బిట్ కాయిన్ ధర వెంటవెంటనే పడిపోతుంది. ఎలా అంటే మనం ఊహించలేనంత. ఒక్కసారిగా 8 లక్షల నుంచి 25 వేలకు పడిపోయిన ఆశ్చర్యం లేదు. అందుకే బిట్ కాయిన్ కొనాలనుకునే వారు అందులో Crypto Currency Tradingలో నిష్ణాతులైన వారితో మొదట సంప్రదించి కొనడం ఎంతైనా ఉత్తమం.

బిట్ కాయిన్ ఇండియాలో చలామణీ అవుతుందా?

బిట్ కాయిన్ ప్రస్తుతం ఇండియాలో లీగల్ గా చెల్లుబాటవుతుంది. దీని కారణం మార్చ్ 2020లో సుప్రీమ్ కోర్ట్, 2018లో RBI విధించిన cryptocurrency ట్రేడింగ్ పై బ్యాన్ ఎత్రివేయడమే. కాబట్టి బిట్ కాయిన్ ఇప్పుడు ఇండియాలో ఎవరైనా కొనచ్చు మరియు ట్రేడ్ చేయొచ్చు.

Check Bitcoin Legal countries list: Click Here

బిట్ కాయిన్ ఎలా కొనాలి How to Buy Bitcoin in Telugu?

బిట్ కాయిన్ కొనాలనుకునే వారు Crypto Exchanges సహాయంతో ఇండియా నుచి ట్రేడ్ చేయవచ్చు. Coinbase, Binance, Unocoin, Local Bitcoins, WazirX లాంటి crypto trading యాప్స్ ద్వారా కొని ట్రేడింగ్ మొదలుపెట్టొచ్చు.

అయితే ఒక బిట్ కాయిన్ విలువ చాలా ఎక్కువ కాబట్టి దానిని కొనాలనుకునే వారు అందులో చాలా చిన్న భాగాన్ని మాత్రమే కొనడం ఉత్తమం. ఒక రూపాయి 100 పైసలుగా ఎలా విభజించబడిందో అలాగే, ఒక బిట్ కాయిన్ 10 కోట్ల సతోషీలాగా విభజించబడింది. అంటే 1 BTC = 100 million satoshi అనమాట. ప్ర్తస్తుతం ఒక Satoshi విలువ, 1 Satoshi = 0.00930474 INR గా వుంది.

Buy Bitcoin: Click Here

బిట్ కాయిన్ కరెన్సీ ఎక్కడ ఉంచుతారు?

మన డబ్బు దాచుకోడానికి బ్యాంకులు వున్నట్టుగా, బిట్ కాయిన్ స్టోర్ చేసుకోడాకి Digital wallet ఉంటుంది. ఈ వాలెట్ లో మీరు కొన్న బిట్ కాయిన్ కు ఒక అడ్రస్ ఉంటుంది. ఈ Bitcoin Wallet Address ద్వారా మీరు డిజిటల్ రూపంలో payments చేయవచ్చు. అయితే ఈ wallet అడ్రస్ మీరు మర్చిపోయిన లేదా దొంగిలించబడినా తిరిగి పొందటం వీలుండదు, మీ బిట్ కాయిన్ సంపదను పోగొట్టుకున్నట్టే! ఎందుకంటే దీనికి ఎటువంటి నియంత్రణా అధికారులు వుండరు.

పెట్టుబడి పెట్టడానికి అనువైన టాప్ క్రిప్టోకరెన్సీ

ప్రస్తుతం ప్రపంచం క్రిప్టోకరెన్సీ వైపు అడుగులు వేస్తోంది. రానున్న కాలంలో దీని హవా ఇంకా పెరగనుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ విపరీతంగా ట్రేడ్ అవుతున్నాయి.

  • Bitcoin
  • Ethereum
  • Doge Coin
  • DIEM
  • Binance Coin
  • Bitcoin Cash
  • Shiba Inu

Also, Read:

Leave a Comment