Web hosting in Telugu: ఇది డిజిటల్ యుగం. ఇప్పుడు అందరూ తమ వ్యాపారాలను Online ద్వారా సేవలు అందించాలి అనుకుంటారు. అలాగే బ్లాగింగ్ మీద మక్కువ వున్నవాళ్లు తమ అభిప్రాయాలను ఆన్లైన్ వేదికల ద్వారా పంచుకోవాలని చూస్తారు. వీటన్నింటికి ఒక online application లేదా web app లేదా website అవసరం. మీ యొక్క files లేదా ఇతర డేటాను వెబ్సైటు రూపంలో పొందుపరచాలి అంటే సర్వర్ హోస్టింగ్ తప్పనిసరి. అయితే హోస్టింగ్ అంటే ఏమిటి, హోస్టింగ్ ఎన్ని రకాలు, హోస్టింగ్ కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం.
సాధారణంగా, వెబ్ హోస్టింగ్ కంపెనీలు ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క అవసరాన్ని బట్టి మీ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ రకాల వెబ్ హోస్టింగ్ సేవలను అందిస్తాయి. అన్నింటికంటే ముందు, మీరు ఒక చిన్న వెబ్‌సైట్‌ను నిర్మిస్తున్నారా లేదా అధిక స్థాయి వ్యాపారాన్ని నడుపుతున్నారా అనే స్పష్టమైన ఆలోచన మీకు ఉండాలి. వెబ్ హోస్ట్ అందించే బడ్జెట్ ప్లాన్ గురించి కూడా మీరు నిర్ధారించుకోండి.
What is web hosting in Telugu వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?
వెబ్ హోస్టింగ్‌కు సంబంధించి మీ సందేహాలన్నింటినీ స్పష్టం చేయడానికి మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసిన వివిధ రకాల వెబ్ హోస్టింగ్లను మీకు వివరిస్తాము. వెబ్ హోస్టింగ్ అనేది ఆన్లైన్ సేవ తప్ప మరొకటి కాదు, ఇది మీ స్వంత వెబ్సైట్ యొక్క content ఇంటర్నెట్లో ప్రచురించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, తద్వారా ప్రజలు మీ వెబ్‌సైట్‌ను access చేయవచ్చు లేదా మిమ్మల్ని సంప్రదించడానికి సహాయబడుతుంది.
వెబ్ హోస్టింగ్ అంటే ఏమిటి?
మీ సరుకులను నిల్వ చేయడానికి మీకు ఒక గది లేదా స్థలం అవసరం ఉన్నట్లే, ఒక వెబ్సైట్ నిర్వహించాలంటే ఆన్లైన్లో వెబ్ హోస్టింగ్ అవసరం.
సింపుల్ గా చెప్పాలి అంటే – “వెబ్ హోస్టింగ్ మీ వెబ్సైట్ యొక్క డేటా ఫైల్‌లను online servers లో భద్రపరుస్తుంది”. ఆ సర్వర్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ముఖ్యం.
Hosting Server (వెబ్ హోస్టింగ్ సర్వర్)
సర్వర్ అనేది విరామం లేకుండా నడిచే కంప్యూటర్ తప్ప మరొకటి కాదు, ఇది మీ వెబ్సైట్ లేదా వెబ్‌పేజీకి Online లో పొందుపరిచి శోధకులకు అన్ని సమయాలలో ప్రాప్యత పొందేలా అందుబాటులో ఉండేలా చేస్తుంది.
వెబ్ హోస్టింగ్ ఎలా పని చేస్తుంది?
హోస్టింగ్ కంపెనీస్ మీ వెబ్సైట్ ఫైల్‌లను వెబ్ సర్వర్లలో నిల్వ చేస్తాయి. మీ వెబ్‌సైట్‌ను చూడటానికి ఎవరైనా వారి బ్రౌజర్లో URL ను టైపు చేసినప్పుడు, ఈ వెబ్ సర్వర్లు క్లయింట్ నుండి ఒక అభ్యర్థనను అంగీకరిస్తాయి మరియు మీ వెబ్సైట్ ఫైళ్ళ కాపీని వారి కంప్యూటర్‌కు పంపుతాయి, దాని ఫలితంగా మీ వెబ్సైట్ అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది.
వెబ్ హోస్టింగ్ కొనే ముందు పరిగణలోకి తీసుకోవలసిన అంశాలు
- మీ హోస్టింగ్ సర్వీస్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, అంటే servers యొక్క up time గురించి తెలుసుకోవాలి
- సర్వర్స్ యొక్క డేటా సెంటర్స్ లొకేషన్ మీ టార్గెట్ ఆడియన్స్ కు దగ్గర్లో ఉండటం మంచిది. అనగా మీ బ్లాగు భారతీయులకే పరిమితం అయితే, మీ బ్లాగు యొక్క వెబ్ హోస్టింగ్ కూడా భారత దేశంలో తీసుకోవటం మంచిది. దీని వల్ల latency తగ్గుతుంది
- కొన్ని సార్లు మీ సర్వర్స్ యొక్క స్పీడ్ మీ బ్లాగు యొక్క ర్యాంకింగ్స్ ను పెంచుతుంది. కాబట్టి స్పీడ్ ఎక్కువ ఇచ్చే హోస్టింగ్ ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి
- మీ వెబ్ హోస్టింగ్ కంపెనీ 24/7 సపోర్ట్ ఇస్తుందో లేదో తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో మీ సర్వర్స్ down అయితే మీరు కాల్ చేసి కనుక్కునేలా ఉండాలి
- వెబ్ హోస్టింగ్ కంపెనీల యొక్క రివ్యూస్ చదవటం మంచిది
- అలాగే Online లో అందుబాటులో వుండే టూల్స్ ఉపయోగించి నేరుగా మీరే speed test, latency test వంటి సర్వర్ సంబంధిత విషయాలు తెలుసుకోవచ్చు
Types of Web Hosting in Telugu వెబ్ హోస్టింగ్ ఎన్ని రకాలు?
వెబ్ హోస్టింగ్ పరిశ్రమలో వివిధ రకాల హోస్టింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మీ వ్యాపారానికి ఏది సరైనదో తెలుసుకోవడానికి, అందులో ముఖ్యమైనవి
- Shared Server Hosting
- WordPress హోస్టింగ్
- డెడికేటెడ్ హోస్టింగ్
- క్లౌడ్ హోస్టింగ్
- వర్చువల్ ప్రైవేట్ సర్వర్ (VPS) హోస్టింగ్
మీరు ఏ రకమైన హోస్టింగ్ తీసుకోవాలి అనేది మీ వెబ్సైట్ యొక్క అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వెబ్సైట్ యొక్క వ్యాపారం, లావాదేవీలు, అవసరాలు భిన్నంగా ఉంటాయి. ఆయా అవసరాల దృష్ట్యా మీ హోస్టింగ్ ఎంచుకోవాలి.
ఉదాహరణ: చిన్న వెబ్సైటు shared హోస్టింగ్ తో మొదలైతే, వ్యాపార రంగంలో వుండే వెబ్సైట్లు VPS హోస్టింగ్ సేవలు ఎంచుకుంటాయి.
ఉత్తమ హోస్టింగ్ కంపెనీలు
ప్రపంచంలో ఎక్కువ వెబ్సైట్లు shared hosting మీదనే పని చేస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది cloud hosting వైపు చూస్తున్నారు. దీనికి కారణం Server speed. అయితే ప్రస్తుతం cloud hosting కు కావలసిన services అందుబాటులో లేవు. మీకు మీరు సొంతంగా server deploy చేసుకోవాలి. అయితే cloudways లాంటి కంపెనీలు 10 dollars కు మీకు cloud హోస్టింగ్ అందిస్తున్నాయి. ఇక్కడ ఉత్తమ హోస్టింగ్ కంపెనీల జాబితా చూద్దాం.
- Digital Ocean (Cloud Hosting): $5/mo
- Cloudways (Managed Cloud Hosting): $10/mo
- SiteGround (Shared Hosting): $4.99/mo
- Hostinger (Shared Hosting): Rs.79/mo
- NameCheap (Shared Hosting): Rs.85/mo
Also, Read: