Heart Touching Love Quotes in Telugu 2022: When you’re in a relationship, saying “I love you” may not be enough to express your feelings. However, you can use romantic love quotes to express your feelings in a creative way. You’re not the only one who struggles to come up with the right words. Because let’s face it, not everyone is gifted in this area. We’ve put together a list of some of the best romantic quotes to help you express your feelings for your significant other.
Heart Touching Love Quotes in Telugu 2022
ప్రేమ అన్నది వక అద్భుతము, అది కేవలము మొదటి చూపులోనే ప్రేమలో పది పోవచ్చు.”
“మీరు ప్రేమ దండగ అని అనుకుంటే, మీరు ఎప్పుడు నిజముగా వక వ్యక్తిని ప్రేమించా లేనట్టే.”
“ప్రేమించడం వలన హాని జరగదు, కానీ ద్వేషించడము వలన జరుగును.”
నాకోసం నువ్వు చేసిన త్యాగాలకు, నాకోసం నువ్వు ఇష్టంగా చేస్తున్న ప్రతి పనిని చూసి నీకు థ్యాంక్స్ చెప్పాలనుకొంటా. కానీ నీ ప్రేమలో మైమరచిపోయి చెప్పడం మరచిపోతుంటా. నా జీవితాన్ని రంగులమయంగా, ఆనందాల హరివిల్లుగా మార్చిన నీకు ప్రేమపూర్వక ధన్యవాదాలు.
నా హృదయాన్ని తాకిన నీ అనురాగం నీతో ప్రేమలో పడిపోయేలా చేసింది.
సూర్యుని వెలుగు కంటే నీ నవ్వులోని వెలుగే నా జీవితాన్ని ప్రకాశవంతంగా మార్చేస్తుంది.
నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా. ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే.. నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.
నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు. నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.
శ్వాస తీసుకోవడం, నిన్ను ప్రేమించడం ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే.. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.
సూర్యోదయాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మరొక రోజు నీతో గడిపే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఆ విషయాన్ని ప్రతి రోజూ నాకు గుర్తు చేస్తున్నందుకు. ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను. నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా. ఆ తర్వాత తెలిసింది. నీ గురించి ఆలోచిస్తున్నానని.
నిన్ను కలిసిన ఆ తొలి క్షణం నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని
నా హఈదయాన్ని నువ్వు దొంగిలించావు. ఫర్వాలేదులే దాన్ని నీ దగ్గరే ఉంచుకో.
నువ్వు నన్ను తాకిన మొదటి క్షణంలోనాకేమి అనిపించిందో తెలుసా? నువ్వు నాకోసమే పుట్టావని.
Heart Touching Love Quotes
1.నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది. నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.
2. నువ్వు వందేళ్లు బతికితే.. నీకంటే ఒక రోజు ముందే నేను చచ్చిపోతాను. ఎందుకంటే నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బతకలేను.
3. కాలాన్ని వెనక్కి తిప్పే వీలుంటే.. నిన్ను ఇంతకంటే ముందే నా జీవితంలోకి వచ్చేలా చేస్తా. ఎక్కువ కాలం ప్రేమిస్తా.
4. నీకు నేను చాలాసార్లు ఇంటికి జాగ్రత్తగా వెళ్లు, త్వరగా నిద్రపో, భోంచేయ్ అని చెబుతూ ఉంటా కదా.. ఆ సమయంలో నీకు ఏం చెప్పాలనుకొంటానో తెలుసా? ఐ లవ్యూ అని.
5. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అంటే దానర్థం నీ రూపాన్ని ప్రేమిస్తున్నానని కాదు. నీ మనసును, నీ గుణాన్ని, నీ అలవాట్లను, నీ లోపాలను అన్నింటినీ ప్రేమిస్తున్నాను.
6. నా తుదిశ్వాస విడిచేవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ నిన్నే ప్రేమిస్తా.
7. నిన్ను చూసినప్పుడు నీతో మాట్లాడటానికి భయపడ్డాను. నీతో మాట్లాడిన తర్వాత నిన్ను తాకడానికి భయపడ్డాను. తాకిన తర్వాత ప్రేమించడానికి భయపడ్డా. ప్రేమించిన తర్వాత నువ్వు నాకెక్కడ దూరమైపోతావోనని భయపడుతున్నా. ప్లీజ్ నన్ను వదిలి వెళ్లకు.
8. నీతో సమయం గడుపుతున్నప్పుడు అందమైన పూదోటలో సుమనోహారాలను ఆస్వాదిస్తున్నట్టనిపిస్తుంది. నాలో చైతన్యం నింపిన నువ్వే నా ప్రియమైన దేవతవు.
9. నీ మీద నాకున్న ప్రేమకు అంతం లేదు. ఆరంభమూ లేదు. నా శరీరంలో అతి ముఖ్యమైన, నా ప్రాణం నిండిన అవయవంగా మారిపోయావు. నీ నుంచి ప్రేమను తప్ప ఇంకేమీ ఆశించడం లేదు. నీ మనసులో స్థానాన్ని మాత్రమే కోరుకొంటున్నాను. నా బలహీనత, బలం రెండూనువ్వే.
10. నీ గురించి ఎదురు చూసీ చూసీ చచ్చిపోతానేమో డార్లింగ్. భయపడకు. ఎన్ని వేల సంవత్సరాలైనా సరే నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం.
Heart Touching Love Quotes 2022
1.నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. అవన్నీ నాకు మధురమైన జ్నాపకాలే. ఈ క్షణం కూడా నువ్వు నా పక్కన ఉంటే బాగుండుననిపిస్తుంది. కానీ కొన్ని రోజులు ఇలా తప్పదు డియర్. మిస్ యూ అండ్ లవ్యూ.
2. జీవితంలో చిన్న చిన్న విషయాలు చాలా సంతోషాన్నిస్తాయంటారు. అది నిజమని ఈ క్షణం వరకు నాకు అనిపించలేదు. నువ్వు దగ్గరున్నప్పుడు చాలా చిన్న విషయాలుగా అనిపించినవే ఇప్పుడు నేను మిస్సవుతున్నాను. నీ చేతి వంట, నువ్వు చేసిన కాఫీ చాలా మిస్సవుతున్నాను. అందుకే వీలైనంత వరకు ఎక్కువ సమయం నీతో గడపడానికి కేటాయిస్తాను.
3. నువ్వు నా జీవితంలోకి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావో.. నీకు దూరంగా ఉన్న ఈ నాలుగు రోజుల్లో నాకు తెలిసింది. నువ్వు నా పక్కన లేకపోతే నా జీవితం ఇంత శూన్యంగా ఉంటుందా అనిపిస్తుంది.
4. నువ్వు దూరంగా ఉన్న ప్రతి క్షణం చాలా భారంగా అనిపిస్తోంది. రెక్కలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి వాలిపోవాలని ఉంది. క్షణమొక యుగమంటే ఏంటో ఇప్పుడు తెలిసొచ్చింది.
5. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేనెంత కోపంగా ఉన్నా.. ఎంత పిచ్చిగా ప్రవర్తించినా.. నీతో గొడవపడినా.. నాపై నీకున్న ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. నీమీద నాకున్న ప్రేమ కూడా ఏ మాత్రం తగ్గదు.
6. నువ్వు నా జీవితంలోకి అడుగు పెట్టిన మొదటి క్షణమే నాకు అర్థమైంది. నువ్వే నా ప్రపంచమని. నా ప్రపంచం ఎప్పటికీ నాకు దూరంగా ఉండదు. తన ప్రేమ ఎప్పుడూ నాతోనే ఉంటుంది.
7. ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ ఉంటే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ ప్రేమను నిలబెట్టుకొంటారు. మనిద్దరి మధ్య ఉన్న ఈ దూరం తాత్కాలికమే. ఇది మన ప్రేమకు పరీక్షలాంటిది. ఆ పరీక్షలో ఇద్దరూ కలసి పాసవడానికి ట్రై చేద్దాం.
8. ప్రేమ భరించే శక్తినిస్తుంది. ప్రేమ నమ్మకాన్నిస్తుంది. ప్రేమ ఆశలు చిగురింప చేస్తుంది. అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మనిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా.. ఆ దూరాన్ని ఇట్టే కరింగేచేస్తుంది.
9. ఎలాంటి పరిస్థితులెదురైనా సరే.. నేనెంత దూరంలో ఉన్నా సరే.. నువ్వు బాధపడుతున్నావనిపిస్తే చాలు నీ దగ్గరకు వచ్చి వాలిపోతా. ఎందుకంటే నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను.
10. నిజమైన సంతోషం గుండెల్లో దాగి ఉంటుందంటారు. నిజమే.. నా సంతోషం నా గుండెల్లోనే దాగి ఉంది. నా సంతోషం నువ్వే కదా.
To make the relationship stronger these types of quotes are the most important, so dont hesitate to pick these wonderful quotes.
Also Read: