Colonel Santosh Babu: Family, Indian Army, Death, Maha Vir Chakra & Statue: Colonel Santosh Babu died in the Chinese army attack at Galwan Valley in eastern Lakadakh in June 2020. Minister for Municipal Administration and Urban Development K T Rama Rao unveiled the statue of Colonel Santosh Babu in Suryapet on his first death anniversary. Here is the Life Story of Colonel Santosh Babu.
దేశాల మధ్య సైనిక మరియు దౌత్య చర్చలు జరుగుతున్నప్పటికీ, చైనా ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చడానికి ప్రయత్నించడంతో, భారత సైన్యం వాస్తవ నియంత్రణ రేఖ వెంట జూన్ 15వ తేదీ 2020న చైనాతో ముఖాముఖిలో కల్నల్ ర్యాంక్ అధికారితో సహా 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ ఘర్షణలో మరణించిన 16 బీహార్ రెజిమెంట్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు, తెలంగాణకు చెందిన వ్యక్తి.
Colonel Santosh Babu: Family, Indian Army, Death, Maha Vir Chakra & Statue
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్‌బాబు 1983, ఫిబ్రవరి 13న జన్మించారు. నేషనల్ ఢిపెన్స అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. సంతోష్ బాబు 16 బీహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సంతోష్ బాబు 2004 లో భారత సైన్యంలో చేరాడు మరియు మొదట జమ్మూ కాశ్మీర్లో పోస్ట్ చేయబడ్డాడు. అతని తండ్రి బి ఉపేందర్ రిటైర్డ్ బ్యాంకర్, ఆయనకు భార్య, కుమార్తె, కొడుకు ఉన్నారు, వీరు Delhiలో నివసిస్తున్నారు. సంతోష్ బాబు హైదరాబాద్‌లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తుండగా వీరమరణం చెందారు.
2019 కల్నల్‌గా బాధ్యతలు / కమాండింగ్ ఆఫీసర్
2004 డిసెంబర్లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్లో కల్నల్‌గా పదోన్నతి పొందారు. బిహార్ 16వ రెజిమెంట్ కామాండింగ్ అధికారిగా ఉన్న సమయంలో.. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో 2020, జూన్ 15న వీరమరణం పొందారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా కల్నల్ సంతోష్‌బాబు విధులు నిర్వహించాడు.
కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం
ఈ ప్రాణాంతక ఘర్షణలకు ఏడాది పూర్తయిన సందర్భంగా దేశం యావత్తూ కల్నల్ సంతోష్ బాబు త్యాగనిరతిని స్మరించుకుంటోంది. ఈ ఘర్షణల్లో మరణించిన అమర జవాన్లకు కన్నీటి నివాళి అర్పిస్తోంది. భారత భూభాగంపైకి చైనా జవాన్లు అడుగు పెట్టనివ్వకుండా వారిని నిలువరించడంలో తెగవను ప్రదర్శించారు. అసమాన ధైర్య సాహసాలను కనపరిచారు. చైనా సైనికులు సంతోష్ బాబును తోసివేయడంతో లోయలో పడ్డారు. దీనితో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి సైనికులు ఆయనను ఆర్మీ క్యాంప్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మహావీరచక్ర అవార్డు గ్రహీత కల్నల్ సంతోష్‌బాబు
ఈ ఘర్షణల్లో అమరుడైన సంతోష్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర అవార్డును ప్రకటించింది. వీరుడి మరణం సూర్యాపేట ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందించింది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.
ఆ కుటుంబానికి ఆయన లేని లోటును పూడ్చలేనిది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంతోష్‌బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంతో పాటు పిల్లల చదువుకు, హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి జూబ్లిహిల్స్‌లో ఇంటి స్థలాన్ని కేటాయించింది.
కల్నల్ సంతోష్ చౌరస్తా
వీరుడి మరణం జీర్ణించుకోలేని సూర్యాపేట జిల్లా ప్రజలు ఆయన జ్ఞాపక చిహ్నంగా కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోష్ చౌరస్తాగా నామకరణం చేశారు.
విగ్రహావిష్కరణ
ఆయన స్మృతిగా స్వస్థలం సూర్యాపేట్‌లో తెలంగాణ ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సంతోష్ బాబు నిలువెత్తు విగ్రహాన్ని నిర్మించింది. దీని ఎత్తు తొమ్మిది అడుగులు. సూర్యాపేట పట్టణంలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహావీర చక్ర, కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు విగ్రహాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.