Aadhaar & PAN Card Link in Telugu: భారత ప్రభుత్వం ఆధార్ కార్డును పాన్ కార్డుతో లింక్ చేయటానికి జూన్ 30న చివరి తేదీగా ప్రకటించింది. అటుపిమ్మట ఫైన్ కట్టి లింక్ చేసుకునే సౌకర్యం వుంది. కానీ చూస్తుంటే ఆ డెడ్ లైన్ పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా డెడ్ లైన్ పొడిగించే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ అందరికీ ఇచ్చే సలహా, వీలైనంత తొందరగా లింక్ చేసుకోమని. మనకు అందుబాటులో వున్న పద్దతుల ప్రకారం, రెండు పద్దతులలో మీ యొక్క పాన్ కార్డుకు ఆధార్ నెంబరును లింక్ చేసుకోవచ్చు. మొదటి పద్దతి ఆన్లైన్ ద్వారా, రెండవ పద్దతి ఎస్ఎంఎస్ ద్వారా. ఈ రెండు పద్దతులను అనుసరించి మన ఆధార్ కార్డును పాన్ కార్డుతో ఎలా లింక్ చేయాలో చూద్దాం.
Contents
Aadhaar & PAN Card Link in Telugu | ఆధార్ కార్డును పాన్ కార్డుతో ఎలా లింక్ చేయాలి?
1. ఆన్లైన్ ద్వారా లింక్ చేయటం
- ఇందుకు గానూ మనకు అందుబాటులో వున్న వెబ్సైటు: Income Tax India
- ఆ లింక్ మీద క్లిక్ చేసిన తరువాత మీకు లింక్ ఆధార్ అనే పేజీ కనబటుతుంది
- మీ ఆదార్ నంబరుని, పేరుని టైపు చేయండి,
- అలాగే verify చేయటానికి captcha ను ఎంటర్ చేయండి
- లింక్ ఆదార్ మీద క్లిక్ చేయండి
- మీ ఆధార్ పాన్ కార్డుతో లింక్ అయిపోయినట్లే
ఆధార్ పాన్ లింక్ స్టేటస్ చెక్ చేసుకోండి (Check Aadhaar PAN Link Status)
మీ ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే క్రింద కనబడుతున్న లింక్ మీద క్లిక్ చేయండి.
Check Link Status: Click Here
2. ఎస్ఎంఎస్ ద్వారా లింక్ చేయటం
ఎస్ఎంఎస్ పద్దతి ద్వారా లింక్ చేసుకునేందుకు ముందుగా మీరు 576768 లేదా 56161 నెంబర్లకు ఈ క్రింది సూచించిన పద్దతులలో ఎస్ఎంఎస్ చేయాల్సి ఉంటుంది.
UIDPAN<12 అంకెల ఆధార్><10 అంకెల పాన్> అని మెసేజ్ చేసి 576768 లేదా 56161 నెంబర్లకు పంపాలి
Read: AP Spandana Toll Free Number