Sri Sri Quotes In Telugu 2022: That’s what Mahakavi Sri wrote in his much-lauded tome, ‘Mahaprasthanam,’ When he was in his early twenties, he composed these sentences and lived his life in the same way.
Sri Sri Quotes In Telugu 2022
In spite of the book’s 1950 publication date, most of the poetry in it was written during the 1930s. Drought, starvation, inflation, and other crises characterized those years.
ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.- శ్రీ శ్రీ
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రు వొక్కటి ధారపోశాను! నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!
మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి! – శ్రీ శ్రీ
నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్దకాన్ని వదిలేయ్ … – శ్రీ శ్రీ
ఏదీ తనంత తానే నీ దరికి రాదు…శోధించి సాధించాలి…అదే ధీరగుణం.
కుదిరితే పరిగెత్తు… లేకపోతే నడువు… అదీ చేతకాకపోతే… పాకుతూ పో … అంతేకాని… ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు… – శ్రీ శ్రీ
పసిడి రెక్కలు విరిసి కాలం పారిపోయిన జాడలేవి? ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సముహలేవి తల్లీ.
ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.- శ్రీ శ్రీ
పదండి ముందుకు, పదండి ముందుకు తోసుకుపోదాం పైపైకి.
నిప్పులు చిమ్ముకుంటూ ..నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు క్రక్కుకుంటూ..నేలకు నే రాలిపోతే, నిర్దాక్షిణ్యంగా వీరే…
మరో ప్రపంచం ఏముకలు క్రుళిన,..వయసు మళ్ళిన,..సొమరులార, చావండి, నెత్తురు మండె,..సక్తులు నిండె,..సైనికులార రారండి
మంటలచేత మాట్లాడించి, రక్తం చేత రాహాలాపన చేయిస్తాను.
ఎండ కాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగి పోలేదా! వాన కాలం ముసరి రాగా నిలువు నిలువున నీరు కాలేదా? శీత కాలం కోత పెట్టగ కొరడు కట్టీ, ఆకలేసీ కేక లేశానే!
పట్టణాలలో, పల్లెటూళ్లలో, బట్టబయలునా, పర్వతగుహలా, ఎడారులందూ, సముద్రమందూ, అడవుల వెంటా, అగడ్తలంటా, ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ గంటలు! గంటలు! గంటలు! గంటలు! గంటలు! గంటలు!
యముని మహిషపు లోహఘంటలు మబ్బుచాటున ఖణేల్మన్నాయి! నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికిపడ్డాయి! ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తే పరుగు పెట్టేయి!
కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా- హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!
His poetry was influenced by the hardships faced by the common man at the time. A French surrealist named Jean Paul Sarte had a profound effect on him.
Also Read: