Life Changing Heart Touching Life Quotes in Telugu 2022

Life Changing Heart Touching Life Quotes in Telugu: Life is a miracle; from birth to death, a man goes through hardships, joys, anger, and pain. Life is all about experiencing all of life’s emotions.

Life Quotes in Telugu by great minds to help us learn about life and inspire us in difficult times. These quotations not only inspire us, but they will also guide us when we face difficulties in achieving our life goals.

Advertisement
Advertisement

Life Changing Heart Touching Life Quotes in Telugu 2022

Life Changing Heart Touching Life Quotes in Telugu 2022

జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

నీవు ప్రతీరోజు ఒకటికన్నా మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు, అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.

మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు.

మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయదగిన పనులు చేయాలి.

ఏడ్చనివాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.

ఒక ధనవంతుడుకి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది మాత్రమే.

నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.

Life Changing Heart Touching Life Quotes in Telugu

పనివంతులు “పని” ని కూడా “విశ్రాంతి” గా భావిస్తారు. బద్దకస్తులు “విశ్రాంతి” ని కూడా “పని” లా భావిస్తారు.

ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.

అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.

అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.

అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం

ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు. దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు. దాని గురించి పని చేయడం తెలియాలి.

ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు.

తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.

జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు. అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.

జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం

సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా

జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయ

ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి.

నేను అదృష్టాన్ని నమ్ముతాను. ఎందుకంటే నేనెంత కష్ట పడితే అది నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు మన కృషితోనే ఉంటుంది.

Share these life-changing and heartfelt quotes with those in your life who need motivation, and keep checking back for more interesting quotes that could change your life.

Also Read:

Leave a Comment