Ugadi Pachadi 6 Tastes in Telugu: ఉగాది పచ్చడి విశిష్టత

Ugadi Pachadi 6 Tastes in Telugu: ఉగాది పచ్చడి విశిష్టత

Ugadi Pachadi 6 Tastes in Telugu: ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభమవుతుంది. ఈ పండుగను దేశవిదేశాల్లో ఉన్న తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముక్యత ఉంది. మన హిందూ సంప్రదాయంలో ఉగాది రోజు చేసే ముఖ్యమైన పనులు చాలానే వున్నాయి, అందులో కొన్ని ఉగాది రోజున పంచాంగ శ్రావణం వినడం. నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం అలాగే ఉగాది పచ్చడి తినడం.

Ugadi Pachadi 6 Tastes in Telugu
Ugadi Pachadi 6 Tastes in Telugu

2021 ఉగాది రోజు నుంచి ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పండగ స్పెషల్ ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. అందువల్ల షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని ఈ పచ్చడి ఇచ్చే సందేశం. ఇక ఉగాది పచ్చడిలో చాలానే ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా నిలుస్తాయి.

Ugadi Pachadi 6 Tastes in Telugu: Everything You Need to Know About Ugadi pachadi

ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. ఉగాది రోజున అభ్యంగ స్నానం చేసి.. ఉగాది పచ్చడి చేసి.. పరగడుపున అల్పాహారంగా తీసుకుంటారు. ఉగాది పచ్చడి .. ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెబుతుంది. మనిషి జీవితంలో ఉండే ఎదురయే కష్ట సుఖాలను ఒకేరీతిన చూడాలని సూచిస్తుంది.

Read: 60 Telugu Year Names in English

Ugadi Pachadi 6 Tastes in Telugu

ఉగాది నాడు షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది.

  1. కొత్తబెల్లం – తీపి – ఆనందానికి సంకేతం
  2. ఉప్పు – ఉప్ప – జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
  3. వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
  4. చింతపండు – పులుపు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
  5. పచ్చి మామిడి ముక్కలు – పులుపు – కొత్త సవాళ్లు
  6. మిరపపొడి – కారం – సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

Importance of Ugadi pachadi

  1. ఈ పచ్చడిలో తీపిని ఇస్తుంది కొత్తబెల్లం, ఇది ఆనందానికి సంకేతం, దీని ఔషధ గుణం ఆకలిని కలిగించడం
  2. ఉగాది పచ్చడిలో రెండో రుచి ఆమ్లం, పులుపు, ఈ రుచి విసుగుకి సంకేతం. పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులను సూచిస్తుంది. ఉగాది పచ్చడిలో ఈ రుచి కోసం కొత్త చింతపండుని ఉపయోగిస్తారు. చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
  3. ఉగాది పచ్చడిలో మూడో రుచి కటు అంటే కారం. ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. కారం శరీరంలోని క్రిముల్ని నాశనం చేస్తుంది.
  4. ఉగాది పచ్చడిలో మరో ముఖ్యమైన రుచి లవణం.. ఉప్పు.. ఇది భయానికి జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం..
  5. ఉగాది పచ్చడి ఆరు రుచుల్లో అతిముఖ్యమైదని తిక్త.. చేదు.. ఇది జీవితంలో కలిగే బాధలకు.. దుఃఖనికి సంకేతం.. ఈరుచి కోసం వేప పువ్వుని ఉపయోగిస్తారు. ఈ వేప పువ్వు శరీర ఆరోగ్యానికి కూడా పలు విధాలుగా మేలు చేస్తుంది.

Leave a Comment