Plasma Donation in Telugu (కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా థెరపీ): గత కొన్ని రోజులగా వార్తల్లో హల్చల్ చేస్తున్న మాట ప్లాస్మా. కొరోనా వచ్చి నయమైన వారు తమ యొక్క ప్లాస్మా దానం చేయడం ద్వారా అది కొరోనాతో భాద పడుతున్న రోగులకు సహాయపడుతుంది అనే వార్తలు రోజూ విటూయీ వున్నాం. పైగా సచిన్ టెండుల్కర్ నుంచి రాజామౌళి లాంటి ప్రముఖులు ప్లాస్మా డొనేషన్ చేయమని తమ అభిమానులకు చెప్తూనే వస్తున్నారు. అయితే ఈ ప్లాస్మా అంటే ఏమిటి, అది ఏవిదంగా మనల్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
What is Plasma Donation in Telugu?
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటో తెలుసుకోండి.. బాల్యంలో ప్రతిఒక్కరికీ దెబ్బలు తగిలే ఉంటాయి. అప్పుడు మన శరీరం పైన ఏర్పడే పుండు నుంచి ఎప్పుడూ ఒక రకమైన తెల్లటి నీరు వస్తుంది కదా..! అదే ప్లాస్మా. ఇది ఆ దెబ్బ నయం కావడానికి కావలసిన పదార్ధాలను అక్కడకు చేరవేస్తుందనమాట, అందుకే ఆ నీరు వస్తుంది. ఇది మనం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన ద్రావణాలను కలిగి ఉంటుంది.
ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి?
ప్లాస్మా అంటే రక్తంలో వుండే ద్రవ భాగం. మన రక్తంలో 55% ప్లాస్మా ఉంటుంది, మిగిలిన 45% ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఈ ప్లాస్మాలో కలిసి ఉంటాయి. ప్లాస్మాలో సుమారు 92% నీరు ఉంటుంది. ఇందులో అల్బుమిన్, గామా గ్లోబులిన్ మరియు యాంటీ హిమోఫిలిక్ కారకం వంటి 7% ముఖ్యమైన ప్రోటీన్లు మరియు 1% ఖనిజ లవణాలు, చక్కెరలు, కొవ్వులు, హార్మోన్లు మరియు విటమిన్లు ఉంటాయి.
ప్లాస్మా ఏమి చేస్తుంది?
రక్తం యొక్క ద్రవ భాగం అయిన ప్లాస్మా శరీరంలోని వివిధ అవయవాల కణాలకు పోషకాలను పంపిణీ చేయడానికి సహాయపడుతుంది. పైగా సెల్యులార్ జీవక్రియ నుండి వచ్చే వ్యర్ధాన్ని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులకు విసర్జన కోసం రవాణా చేయడానికి మాధ్యమంలా పనిచేస్తుంది. ఇంతేకాక ప్లాస్మా మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది:
- రక్తపోటును నిర్వహిస్తుంది
- రోగనిరోధక శక్తి కోసం అవసరమైన ప్రోటీన్లను సరఫరా చేస్తుంది
- రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది
- సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను మన కండరాలకు తీసుకువెళుతుంది.
- శరీరంలో PH balance చేయడానికి సహాయపడుతుంది
రక్తం నుంచి ప్లాస్మా ఎలా వేరవుతుంది?
రక్తం నుండి రక్త కణాలను, అనగా ఎర్ర రక్త కణాలు (ఎరిథ్రోసైట్లు), తెల్ల రక్త కణాలు (ల్యూకోసైట్లు), ప్లేట్లెట్స్ (థ్రోంబోసైట్లు) మొత్తం వేరు చేసినప్పుడు ప్లాస్మా ఉద్భవిస్తుంది. ఇది ఆరోగ్యం మరియు జీవితాన్ని నిలబెట్టడానికి అవసరమైన క్లిష్టమైన ద్రావణాలను కలిగి ఉంటుంది.
ప్లాస్మాలో ఏముంటాయి?
ఇది మన శరీరం యొక్క ఆరోగ్యాన్ని చక్కబెట్టడానికి అవసరమైన పరిష్కారాలను కలిగి ఉంటుంది. ప్లాస్మాలో 6–8 శాతం ప్రోటీన్లు ఉంటాయి. దీనిలో సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్, మెగ్నీషియం మరియు కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. అంతే కాకుండా, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, ఆర్గానిక్ యాసిడ్స్, పిగ్మెంట్స్, ఎంజైమ్లతో సహా ఇతర పదార్ధాల ఉన్నాయి. ప్లాస్మా నుంచి ఇన్సులిన్, కార్టికోస్టెరాయిడ్స్ మరియు థైరాక్సిన్ వంటి హార్మోన్లు ఎండోక్రైన్ వ్యవస్థ ద్వారా రక్తంలోకి స్రవిస్తాయి.
ప్లాస్మా దేనికి ఉపయోగిస్తారు?
సాధారణంగా ప్లాస్మాని గాయం, బర్న్ మరియు షాక్ లో వున్న రోగులకు, అలాగే తీవ్రమైన కాలేయ వ్యాధి లాంటి రకరకాల లోపాలతో బాధపడుతున్న వారికి ఇవ్వబడుతుంది. ఇది రోగి యొక్క రక్త పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక లోపాలు మరియు రక్తస్రావం లోపాలు ఎదుర్కొంటున్న వారికి చికిత్స చేయడానికి ప్లాస్మాను ఉపయోగిస్తారు. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై అంటు వ్యాధుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటివారి శరీరంలోకి వైరస్ మరే ఇతర క్రిములు ప్రవేశించగానే, వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్ను నాశనం చేస్తాయి. అందుకే, వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగుల శరీరంలోకి రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారి బ్లడ్ ప్లాస్మా ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
ప్లాస్మా డొనేషన్
ప్లాస్మా దానం చేసేవారి రక్తం యొక్క ద్రవ భాగం కణాల నుండి వేరు చేయబడుతుంది. ఇందుకు గాను సేకరించే రక్తం చేయి నుండి ప్లాస్మాను సేకరించే హైటెక్ మెషిన్ లోనికి పంపబడుతుంది. ఈ ప్రక్రియ మామూలు రక్త దానం చేయడంతో పోలిస్తే కొద్ది నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది.
కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా థెరపీ
ప్లాస్మా థెరపీ వల్ల కరోనా వ్యాధిగ్రస్థులు కోలుకోలేదని, మెరుగుదల పెద్దగా కనిపించలేదని ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్) అభిప్రాయపడుతోంది. అయితే ఇది మా తాత్కాలిక విశ్లేషణ మాత్రమే అని పేర్కొన్నారు.