Best Mahatma Gandhi Quotes in Telugu | మహాత్మా గాంధీ సూక్తులు

Best Mahatma Gandhi Quotes in Telugu | మహాత్మా గాంధీ సూక్తులు

Best Mahatma Gandhi Quotes in Telug (జాతిపిత మహాత్మా గాంధీ సూక్తులు): No need any special introduction for Mahatma Gandhi. However, we need to remember him in our daily lives Since we are enjoying the freedom with his freedom struggle. He was born in Porbandar, Gujarat on 2nd October 1869. He played the most crucial role in the freedom struggle of India and he is the one who lead Indians during the freedom struggle.

mahatma gandhi quotes in telugu

Unlike other freedom fighters, His powerful political weapons were Satyagraha and non-violence that inspired every political leaders around the world. Moreover, He inspired Indian people with his sayings and valuable quotes during his entire life. Here in this article, you will be finding some of the Best Inspirational and Famous Mahatma Gandhi Quotes in Telugu.

Best Mahatma Gandhi Quotes in Telugu | మహాత్మా గాంధీ సూక్తులు

  1. అహింసకు మించిన ఆయుధం లేదు.
  2. ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజలచేతిలోని ఆయుధాలు.
  3. ఎవరికైనా సహాయం చేస్తే మరిచిపో.. ఇతరుల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో
  4. కంటికి కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుంది.
  5. మీరు రేపే చనిపోతారు అన్నట్లుగా బ్రతకండి. శాశ్వతంగా జీవిస్తారు అన్నట్లుగా తెలుసుకోండి.
  6. రేపే మరణిస్తానన్న ఆలోచనతో జీవించు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాందించు
  7. తక్కువ సంపాదించేవారి కన్నా, తక్కువ పొదుపు చేసేవారికే ఆర్థిక ఇబ్బందులు వస్తాయి.
  8. తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే సంపూర్ణ విజయం
  9. ఆత్మవంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొనితెచ్చుకున్నట్లే.
  10. అహింస ఎదుట హింసవలె, సత్యము ఎదుట అసత్యం శాంతించాలి
  11. జీవితం అంటే విశ్రాంతి కాదు, చైతన్యం. అందుకే జీవితమంతా ఆచరణ, ఆచరణ, ఆచరణ.
  12. పుస్తకం గొప్పతనం అందులోని విషయాలపై ఆధారపడదు. అది మనకు అందించే వినూత్న ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది
  13. గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.
  14. అసత్యంతో సాధించిన విజయం కంటే, సత్యంతో సాధించిన పరాజయమే మేలు.
  15. ఎవరైనా మనకిచ్చేది తాత్కాలికమైనది. కృషితో మనం సంపాదించుకునేది శాశ్వతం.
  16. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నువ్వు చేసిన చిన్న తప్పును కూడా కొండంత తప్పుగా భావించు.
  17. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
  18. ఈ ప్రపంచం మనిషి అవసరాలను తీర్చగలదు కానీ కోర్కెలను ఎప్పటికీ తీర్చలేదు.
  19. సముద్రంలో చారెడు నీళ్లు కలుషితమైతే.. సముద్రమంతా చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన మానవత్వం మంటగలిసినట్టు కాదు
  20. మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి.. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి
  21. లేని గొప్పదనం ఉందని చెబితే… ఉన్న గొప్పదనం కాస్త ఊడిపోతుంది.
  22. నన్ను స్తుతించే వారికంటే కఠినంగా విమర్శించే వారి వల్లనే అధికంగా లబ్ధి పొందుతా
  23. అందం అనేది నడవడికలో ఉంటుంది. ఆడంబరాలలో కాదు.
  24. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
  25. మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే
  26. ఆత్మాభిమానం, గౌరవాల్ని వేరెవరో పరిరక్షించరు, మనకు మనమే వాటిని కాపాడుకోవాలి
  27. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలి పోయేది కాదు.. అది అచంచలమైనది. హిమాలయాలంత స్థిరమైనది
  28. మేధావులు మాట్లాడుతారు.. అదే మూర్ఖులైతే వాదిస్తారు
  29. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడానికి ఎంతో ధైర్యం కావాలి
  30. సహాయం చేస్తే మరిచిపో… సహాయం పొందితే గుర్తుంచుకో.
  31. ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
  32. చెడును నిర్మూలించేందుకు ఆయుధాలు పడితే జరిగేది రెండు దుష్టశక్తుల మధ్య యుద్ధమే.
  33. వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే.
  34. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుంది
  35. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం
  36. అంతరాత్మ ‘ఇది తప్పు’ అని చెప్పినా, ఇతరుల మెప్పు కోసమో, తాత్కాలిక ప్రయోజనం కోసమో ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం
  37. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది.. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది

Read: 

Leave a Comment