Digital Streaming Platform Explained in Telugu: Lockdown తరువాత దేశంలో చాలా రంగాలు, కంపెనీలు మూతపడ్డాయి, వ్యాపారలావాదేవీలు కుదేలయ్యాయి, అయినా గత కొద్ది నెలలుగా ఇండియాలో బూమ్ మీదున్న Business ఏదన్నా ఉందా అంటే అది OTT రంగమే. ఇంటర్నెట్ ఈ సమయంలో చాలా రంగాలని ఆదుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కేవలం Internet మీద ఆధారపడిన Digital Media గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే ఈ ఓటీటీ గురించి మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు, మొబైల్ ఫోన్లోనే సినిమాలు, వినోద కార్యక్రమాలు, Live ప్రసారాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇటువంటి అధునాతన పరిస్థితిలో, ఈ టెలివిజన్ కార్యక్రమాలు నుంచి వెబ్ సిరీస్ వైపుకు జనాలు చూపు మళ్లుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈ పరిణామాలను కారణంగానే OTT ప్లాట్‌ఫారమ్‌లు వెలిచాయి.
డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ | What is Digital Streaming Platform? Explained in Telugu
OTT అంటే ఇంటర్నెట్ మీద ఆధారపడి వీడియో లేదా ఇతర మీడియా సంబంధిత కంటెంట్‌ను ప్రదర్శించే ఓవర్-ది-టాప్ ప్లాట్‌ఫాం. దీనిని వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫాం, OTT Platform Service, digital streaming platform అని కూడా పిలుస్తారు. OTT (Over-The-Top) ప్లాట్‌ఫాంకు ప్రజాదరణ మొదట US లో పెరిగింది, ఆ తరువాత అది క్రమేపి అన్నిదేశాలకు వ్యాపించింది. ఇందులో Television shows తో పాటుగా చలనచిత్రాలు, Web Series ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోడానికి వినియోగదారులు ఈ OTT ప్లాట్‌ఫామ్‌లకు నెలసరి లేదా ఒక సంవత్సరానికి Subscription plan తీసుకోవాలి. అయితే, వాటి రుసుము చాలా తక్కువే అని చెప్పాలి.
మీరు సంవత్సర కాలంలో 1000 రూపాయల కంటే తక్కువలో వందల సంఖ్యలో కొత్త సినిమాలు, Shows, వెబ్ సిరీస్ మరియు ఇతర కార్యక్రమాలు చూడొచ్చు.మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, కరోనావైరస్ వల్ల లాక్డౌన్ రావడంతో, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మళయాళ సినిమాలను ఈ OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తున్నారు. మరో వైపు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాటుఫార్మ్స్ కు Tamilrockers లాంటి పైరసీ సైటుల వల్ల వీక్షకుల సంఖ్య తగ్గడం బాధాకరం.
Types of OTT Platforms in Telugu
Transactional Video on Demand (TVOD): OTT ప్లాట్‌ఫాంలో ఒక రకమైన ఈ టీవీఓడీ సేవ వినియోగదారులు తమ అభిమాన టెలివిజన్ షో లేదా చలనచిత్రాలను ఒకసారి చూడాలనుకుంటే, వారు దానిని Rentకు తీసుకుని చూడవచ్చు, లేదా పూర్తిగా కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, ఆపిల్ ఐట్యూన్స్, YouTube Movies మొదలైనవి.
Subscription Video on Demand (SVOD): మీరు వీడియో స్ట్రీమింగ్ కంటెంట్‌ను చూడాలనుకుంటే, దాని కోసం నెలకు లేదా సంవత్సర కాలానికి సభ్యత్వాన్ని పొందాలి. మన దేశంలో ప్రస్తుతం ఎక్కువ కస్టమర్లు వుంది SVOD platform కే అనడంలో సందేహం లేదు. ఉదాహరణకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వీడియో మొదలైనవి.
Advertising Video on Demand (AVOD): ఈ OTT సేవలో ప్రకటనలు ఎక్కువగా వస్తాయి. దీనిలో, కస్టమర్లు కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు, కానీ ఈ కంటెంట్ తో పాటుగా మధ్య మధ్యలో Ads చూడాలి. ఉదాహరణకు చెప్పాలంటే YouTube, MX Player, మొదలైనవి..
OTT ప్లాట్‌ఫాం సేవల ప్రయోజనాలు
- టీవీ కార్యక్రమాలు, సినిమాలు లేదా ఇష్టమైన ప్రోగ్రామ్‌లను చూడటానికి కేబుల్ టీవీ కనెక్షన్ లేదా డిటిహెచ్ కనెక్షన్ అవసరం లేకుండా ఇంటర్నెట్ ఉపయోగించుంకుని సరాసరి తమ smartphones లో కావల్సిన వినోద కార్యక్రమాలు చూడొచ్చు.
- సరికొత్త వెబ్ సిరీస్, డాక్యుమెంటరీలు ఆయా OTT ప్లాట్‌ఫారమ్‌లకు ప్రత్యేకమైనవి, కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ అందుబాటులోకి వస్తాయి, ఇవి వేరే చోట దొరకవు. ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా వంటి కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు.
- కోరుకున్నప్పుడల్లా, OTT App ఉపయోగించి సరికొత్త సినిమాలు చూసే సౌలభ్యం దొరుకుంది
- Android TV, స్మార్ట్ టీవీలకు అనుసందానం చేయడం ద్వారా ఇంటిల్లిపాది కలిసి చూడొచ్చు
- ఎప్పుడు కావాలంటే అప్పుడు Subscription రద్దు చేసుకునే అవకాశం
మార్గదర్శకాలు
ఫిబ్రవరి 25, 2021 న, ఓవర్-ది-టాప్ (OTT) మరియు డిజిటల్ మీడియా కోసం ప్రభుత్వం కొత్త నియమాలను ప్రకటించింది, నీతి నియమావళి మరియు మూడు-స్థాయి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రతి OTT ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అందుకు గాను ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) ఫిర్యాదుల మండలిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే, ఎంఎక్స్ ప్లేయర్, హంగమా షెమరూ, ఆల్ట్ బాలాజీ, అర్హా మీడియా (Aha), ఫైర్ వర్క్, మరియు హోయిచోయ్ లాంటి సంస్థలు ఈ కమిటీ లో భాగస్వామి అవ్వడానికి ముందుకు వచ్చాయి.
Popular OTT Platforms in Telugu
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన OTT ప్లాట్‌ఫాంలు –
Disney+ Hotstar: డిస్నీ యాజమాన్యంలోకి విలీనమైన ఈ భారతీయ OTT ప్లాట్‌ఫారమ్ 400 మిలియన్లకు పైగా నెలవారీ active వినియోగదారులను కలిగి ఉంది. లైవ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ మరియు Bigg Boss వంటి షోలను ప్రదర్శించడం ద్వారా ఇది చాలా ప్రాచుర్యం పొందింది.
Netflix: 2016 లో మన దేశానికి వచ్చి అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్. ఇది అత్యంత ప్రజాదరణ పొందడానికి కారణం చౌకైన Subscription plans, రియాలిటీ టీవీ సిరీస్, Web Series, Originals.
Amazon Prime Video: భారతదేశంలో అత్యంత popular ఓటీటీలో ఇదొకటి. మొదటి మూడు స్థానాల్లో ఒకటిగా ఉంటూ వస్తుంది. దక్షిణ భారతంలో No.1 అని చెప్పడంలో సందేహం లేదు.
Alt Balaji: ఇది భారతీయ సంస్థ, Bollywood filmmaker ఏక్తా కపూర్ యొక్క బాలాజీ టెలిఫిల్మ్స్ స్థాపించిన ఓటీటీ, అయితే ఇందులో ఎక్కువగా హిందీ వినోద కార్యక్రమాలు నడుస్తాయి. SonyLiv: సోనీ 2013 లో తన స్వంత OTT సేవను ప్రారంభించి, స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఈ మధ్యనే 100 మిలియన్ డౌన్లోడ్లను దాటింది. ఇందులో Live TV channels చూడవచ్చు.
ZEE5: ఈ ఓటిటి ప్లాట్‌ఫాం 2018 సంవత్సరంలో ప్రారంభించబడింది. ZEE Network కు సంబందించిన టీవీ చానెల్స్ తో పాటుగా Originals, సినిమాలు చూడవచ్చు.
Voot: Viacom 18’s Voot, 2016 సంవత్సరంలో ప్రారంభించబడింది, ఇందులో అనేక టీవీ కార్యాక్రమాలు, మనం మిస్సయిన సీరియల్స్ చూడొచ్చు. ఇదొకో పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారం.
MX Player: టైమ్స్ ఇంటర్నెట్ మద్దతు ఉన్న MX ప్లేయర్, ఒక Free video streaming platform.
SUN NXT: SUN నెట్వర్క్ గ్రూప్ ప్రారంభించిన ఈ ఓటీటీ South India లో బాగా పాపులర్. ఎందుకంటే వారికి ఇక్కడ చాలా టీవీ చానెల్స్ వున్నాయి. ఎక్కడా దొరకనాన్ని సినిమాలు ఇక్కడ చూడొచ్చు. తెలుగు సినిమాలకు ఇదొక మంచి ఓటీటీ అని చెప్పొచ్చు.
Aha Video: సినీ నిర్మాత అల్లు అరవింద్ 2020లో ప్రారంభించిన ఈ ఓటీటీ Lockdown సమయంలో అందరికీ వినోదాన్ని పంచుతూ దూసుకుపోతుంది. ఇది తెలుగుకు ప్రత్యేకమైన ఓటీటీ.