Chiya Seeds and their Benefits: చియా విత్తనాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అనేక మంది పెద్దలతో పాటు వైద్యులు కూడా చెబుతున్నారు. రోజూ రెండు స్పూన్ల చియా గింజలు తీసుకుంటే శారీరకంగా బలంగానే కాకుండా అందంగా కూడా తయారవుతామంటున్నారు అనుభవజ్ఞులు. ఈ గింజలు చూడ్డానికి సబ్జా గింజల్లా ఉంటాయి. కానీ నల్లగా ఉండే ఈ విత్తనాలు భిన్నమైనవి. మొదట ఇవి అమెరికాలో పండించేవారని తెలుస్తోంది. సౌత్ మెక్సికోలో చియా పంటలు అపారంగా పండిస్తారు. అమెరికన్ల పౌష్టికారమైన ఆహారంలో చియా విత్తనాలు కూడా ఒకటి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మేము అందిస్తున్నాము.
Vitamins, Minerals In Chiya Seeds
బరువు తగ్గాలని ఆలోచన ఉన్నవారు ఎక్కువుగా ఈ చియా విత్తనాలు తీసుకుంటున్నారు. ఇందులో ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ తో పాటు, విటమిన్ ఎ, బి, సి, డి, ఇ ఉన్నాయి. జింక్, కాల్షియమ్, ఫాస్ఫోర్స్, సల్ఫర్, మెగ్నీషియం లాంటి యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఉన్నొట్లు చెబుతున్నారు.
Benefits of Chiya seeds Intake
చియా లో పోషకాలు ఒక్కోటి ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క గింజలో ఇన్ని ఖనిజాలు ఉండడం నిజంగా అద్భుతమే. వీటన్నింటి గురుంచి మీకు కింద వివరంగా తెలియజేస్తున్నాం
చియా విత్తనాలు – లాభాలు
ఫైబర్ – జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్- ఇన్ఫెక్షన్ నుంచి కాపాడతాయి
కాల్సియమ్, మెగ్నిషియం, మాంగనీస్ – అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది, యముకలను దంతాలను బలంగా ఉంచుతుంది
చియా విత్తయాల వల్ల కాన్సర్ కూడా నిరోధించబడుతుంది, చర్మం కాంతివంతంగా తయారవుతుంది, శరీరంలో ఇన్సులిన్ స్థాయిని కూడా నిరోధిస్తుంది.
How To take Chiya Seeds as Juice
చియా విత్తనాలను నీటిలో కలుపుకొని ఉదయం లేదా సాయంత్రం తీసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల చియా విత్తనాలు వేసి కలపాలి. 20 నిమిషాల తరువాత ఆ మిశ్రమంలో తేనె, నిమ్మకాయ వేసుకొని తాగాలి. ఇలా రెండు వారాలు పాటిస్తే మీ శరీరం ఊహించని విధంగా ఆరోగ్యాంగా తయారవుతుంది. మీ బరువు తగ్గి, చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది.
Chiya Seeds and its Side Effects
చియా విత్తనాలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిలో పోషాకాలు అధికంగా ఉండడం వల్ల ఎక్కువగా తీసుకున్నా ఆరోగ్యం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. మలబద్దకం, గ్యాస్, బ్లీడింగ్, డయేరియా వంటి బారిన పడతారు. చియా విత్తనాలకు ఉబ్బే లక్షణం ఉంటుంది. కాబట్టి నీటిలో కలిపిన 20 నిమిషాల తరువాతనే వాటిని తీసుకోవాలి.
Boost Your Immunity
మొదట్లో అమెరికాలోనే వీటిని ఎక్కువగా పండించే వారు. వీటి లాభాలు తెలిసిన తరువాత మన దేశంలోని మట్టి కూడా చియా పంటకు సహకరించడంతో పండించడం మొదలు పెట్టారు. కరోనాను ఎదురుకోవాలంటే ఇమ్మ్యూనిటి చాలా అవసరం. ఎన్నో పోషకాలు కలిగిన ఈ చియా విత్తనాల మిశ్రమాన్ని నేటి నుంచి రోజూ తీసుకోండి. కరోనా లాంటి ప్రాణాంతకమైన వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.