AP Helpline Number (Ambulance, Power, Sand Booking, Farming, Anti-corruption, Fire, Disha and Many More): Are you belongs to the Telugu state AP? then, you should not miss these toll free mobile numbers. On this page, You can find the list of AP state’s emergency toll free numbers such as Ambulance, Power Supply, Sand Booking, Farming and Agriculture help, Medical and Health emergency numbers, Police, Disha number, Public complaints number and Fire station numbers.
The government of AP has made many free services available to everyone to avail the govt schemes and benefits. In case of any type of emergencies, people can call these toll free numbers of the respective departments to solve their problem for free of cost.
AP Helpline Number of All Departments 2021(Ambulance, Power, Sand Booking, Farming, Anti-corruption and Many More)
If you stay in Andhra Pradesh, you can also find these toll free numbers respective departments in the Village / Ward Secretariats. The main aim of this programme is to create a wider awareness among the people on availing the govt services. So,public can easily share and track their issues and problems with the various departments.
Read: AP Spandana Toll-fee Number
#1 Anti-corruption Toll Free Number (అవినీతి నిరోధం) – 14400
వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నంబర్ 14400 కేటాయించారు. 14400 నంబరుకు ఫోన్ చేసిన ఆ ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది పేరు ఇతర వివరాలను చెప్పవచ్చు. ఏసీబీ అధికారులు మీ పేరును గోప్యంగా ఉంచుతారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా అవినీతి, అక్రమాలు జరుగుతున్నా ఈ నంబరుకు ఫోన్ చేయవచ్చు.
#2 Electricity services (విద్యుత్ సేవలు) – 1912
మీ వీధి లేదా మీ ఇంటి విద్యుత్ సరఫరాలో ఎటువంటి సమస్యలు ఎదురైనా 1912 నంబర్‌కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
#3 Government Ambulance (ప్రభుత్వ అంబులెన్స్) – 108
అత్యవసరముగా అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు, ఏదైనా ప్రమాదాలకు గురై గాయపడిన వారు 108కు ఫోన్ చేసి ప్రభుత్వ అంబులెన్సు సేవలు పొందవచ్చు. 108 కాల్ సెంటర్ నుంచి సమీపంలోని అంబులెన్సు వాహన సిబ్బందికి సమాచారం వస్తుంది. వారు వీలైనంత త్వరగా అక్కడకు వెళ్లి, ఆపదలో ఉన్నవారికి ప్రథమ చికిత్స చేసి, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తారు.
#4 Farming (వ్యవసాయం) – 1907
వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉంటే 1907 నంబరుకు ఫోన్ చేయవచ్చు. మీ పంట సాగులో మెళకువలు, దిగుబడులు, సలహాలు, సూచనలను రైతులు పొందవచ్చు.
#5 Medical and Health (వైద్యం, ఆరోగ్యం) – 104
ఆస్పత్రులకు దూరంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, వైద్యసేవలు అందించేందుకు 104 వాహనం ఉపయోగపడుతుంది. ఈ సేవలు పొందాలనుకునే వారు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఈ వాహనంలోని సిబ్బంది ఒక స్థాయి అనారోగ్య సమస్యలకు సంబంధిత టెస్టింగ్, ల్యాబ్‌లో పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారు. అలాగే ఆస్పత్రిలో ప్రసవాంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చేందుకు ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్’ అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నారు.
#6 Police (పోలీసు సేవలు) – 100
ఏ సమయంలోనైనా సరే ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా సాయం పొందేందుకు ప్రజలు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు కూడా దీనిని ఉపయోగించవచ్చు. జిల్లా పోలీసు కార్యాలయంలోని ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో ఈ టోల్‌ఫ్రీ నంబర్ 24 గంటలూ పని చేస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, మాట్లాడే ప్రతి మాటా రికార్డవుతుంది.
#7 Disha (దిశ) – 112, 181
లైంగిక వేధింపులకు గురవుతున్నా, విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నా తమను కాపాడుకొనేందుకు బాలికలు, యువతులు, మహిళలు ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు. హైదరాబాద్‌లో ఓ యువతిపై జరిగిన అమానవీయ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సరికొత్త టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆపదలో ఉన్న మహిళలు 112 లేదా 181 నంబర్లకు ఫోన్ చేస్తే కంట్రోల్ రూము నుంచి వారు ఫోన్ చేసిన ప్రదేశాన్ని గుర్తించి, సమీపంలోని స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. అప్రమత్తమైన ఆ పోలీసు అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకొని రక్షణ చర్యలు చేపడతారు.
#8 Public Complaints (ప్రజా సమస్యలు) – 1902
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలకు సంబంధించిన సమాచారం ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే లభిస్తుంది. ఈ నంబర్‌కు ఫోన్ చేసి, సంబంధిత అధికారులకు సమస్యలు తెలియజేయవచ్చు. గడువు తేదీలోగా వాటిని పరిష్కరించుకోవచ్చు. లేకుంటే మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. దీనివలన అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతాయి.
#9 Fire Station (అగ్నిమాపక కేంద్రం) – 101
ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సాయం కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయాలి. సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు హుటాహుటిన చేరుకుని, ప్రమాదాన్ని నివారిస్తారు. లేదా ప్రమాద స్థాయిని తగ్గిస్తారు.