డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో: Learn Digital Marketing in Telugu for Free

డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో: Learn Digital Marketing in Telugu for Free

Digital Marketing in Telugu (డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో): ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ తమ ఇంట్లో వుండే ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు, అలాంటి వారికి ఒక వేదిక కల్పించేది డిజిటల్ మార్కెటింగ్. Digital Marketing నేర్చుకోవటం ద్వారా సొంతగానే కాకుండా MNC కంపెనీలలో job కూడా సంపాదించవచ్చు. అయితే ఇందులోని మెళుకువలు నేర్చుకోవటం తప్పనిసరి.

digital-marketing-in-telugu

ఈ పోస్టులో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేందుకు కావలసిన అర్హతలు, ఎలా Digital Marketing in Telugu ఉచితంగా నేర్చుకోవచ్చు, ఇది ఎన్ని భాగాలుగా విభిజించబడింది, ఇలాంటి విషయాలు నేర్చుకుంద్దాం. అంతేకాక, డిజిటల్ మార్కెటింగ్ complete course TeluguAha.com లో పొందగలరు.

Learn Digital Marketing in Telugu 2020 for Free

ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ మార్కెటింగ్ వైపు పరుగులు పెడుతుంది. అయితే ఇందులో నిష్ణాతులైనవారు చాలా తక్కువమందే వున్నారని చెప్పాలి. భయట course అందించేవారు కూడా basics తప్ప అందులోని మెలుకవులు నేర్పట్లేదు, దీని వల్ల చాలామంది మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. దీనికి మరో కారణం సహనం, ఓపిక ప్రస్తుత యువతలో లేకపోవటం, digital marketing లో success అవ్వాలి అంటే ముందుగా ఉండాల్సింది సహనం, ఓపిక, వేగంగా నేర్చుకోగలగటం. ఈ మూడు అర్హతలతో పాటుగా ఇంగ్లీష్ పై పట్టు ఉంటే Learning Digital Marketing చాలా తేలిక.

Digital Marketing అంటే ఏమిటి?

కొత్తగా మార్కెట్ లో విడుదలైన ఒక కంపెనీ యొక్క product ను అందరికీ తెలిసేలా Internet ద్వారా ప్రచారం చేయడమే డిజిటల్ మార్కెటింగ్. అయితే ఇది traditional marketing తో పోల్చుకుంటే చాలా వరకు కొత్తగా ఉంటుంది. ఇందులో చాలా భాగాలు వున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

టాపిక్స్/ Topics

Digital Marketing లో ముఖ్యంగా చెప్పుకోదగినవి

  • బడ్జెట్ ప్రణాళిక
  • వెబ్సైట్ రూపకల్పన మరియు Designing
  • కంటెంట్ వ్రాయడం
  • SEO (సెర్చ్ ఇంజిన్ optimization)
  • Social Media Marketing ( ఫేస్బుక్ మర్కెటింగ్, ట్విట్టర్ మర్కెటింగ్ YouTube మర్కెటింగ్ మొదలగునవి)
  • గూగుల్ ప్రకటనలు లేదా Advertising
  • వీడియో Creation
  • ఇమెయిల్ మార్కెటింగ్
  • బ్లాగ్స్

బడ్జెట్ ప్రణాళిక

మీరు ఒక బిసినెస్ మొదలుపెట్టే ముందు బడ్జెట్ ప్రణాళిక ఎలా వేసుకుంటారో, అలాగే ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ Online లో ప్రచారం చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ కోసం బడ్జెట్ వేసుకోవటం తప్పనిసరి. అయితే మీరు సొంతగా ఒక వెబ్సైటు లేదా బ్లాగ్ మొదలుపెట్టాలి అనుకుంటే బడ్జెట్ తక్కువలో అయిపోతుంది.

వెబ్సైట్ రూపకల్పన మరియు Designing

ఇంటర్నెట్ లో చాలా రకాలైన themes, templates అందుబాటులో వున్నాయి, వాటిని మీరు కొని వాడుకోవచ్చు. అయితే మీ Business తగట్టుగా కావాలి అనుకుంటే customized theme ను ఎంచుకోవాల్సిందే. దీనికోసం Website designer ను సంప్రదించాలి.

కంటెంట్ వ్రాయడం

డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ వ్రాయటం ఒక పెద్ద సవాల్. గూగుల్ మీ వెబ్సైటును గుర్తించాలి అంటే content creation తప్పనిసరి. అయితే content SEO తో సరిచేసుకుంటూ user readable గా ఉండటం మంచిది. ఇందుకుగాను Online లో చాలా మంది content writers freelance జాబ్స్ చేస్తుంటారు, వారిలో మీ వెబ్సైటు యొక్క niche లో ఆరితేరిన వారిని సంప్రదించటం మంచిది. లేదా మీరు సొంతగా కూడా రాయవచ్చు.

SEO (సెర్చ్ ఇంజిన్ optimization)

ఒక వెబ్సైటు search engine లో ర్యాంక్ అవ్వాలంటే SEO కీలకం. ఈ టాపిక్ గురించి మరో పోస్టులో చర్చిద్దాం.

Social Media Marketing (సోషల్ మీడియా మార్కెటింగ్)

గూగుల్ ఒక వెబ్సైటును ర్యాంక్ చేయడానికి సోషల్ మీడియాను ఒక సిగ్నల్ గా ఎంచుకుంటుంది. అంటే సోషల్ మీడియా search engines కు ఒక ranking factor అనమాట. మీ బిసినెస్ యొక్క ప్రొడక్ట్స్ ఆధారంగా (Facebook, Twitter, Pinterest, etc) వంటి సోషల్ మీడియా వేదికలలో ఖాతాలు తెరవాలి. వాటిలో ప్రతి నిత్యం మీ Businessకు సంబందించిన పోస్టులు పెట్టాలి. ఈ పోస్టులు engaging గా ఉండేలా చూసుకోవటం మంచిది, లేదా సోషల్ మీడియాలో యాడ్స్ కొనడం మరో మంచి నిర్ణయం. మీ business onlineలో పెరగడానికి తక్కువ ఖర్చుతో అయిపోయేది Facebook Ads, అయితే మీ targets కరెక్టుగా ఉండేలా చూసుకోవాలి.

గూగుల్ ప్రకటనలు లేదా Advertising

ఒక Business మొదలుపెట్టాక గూగుల్ లో Ad Campaigns చేయడం ద్వారా మీ బిజినెస్ యొక్క ప్రమోషన్ వేరే levelకు చేరుతుంది. మీకు orders రావడం మొదలుపెడతాయి. అయితే ఇది ఒక పెద్ద టాపిక్ అనే చెప్పాలి. గూగుల్ ప్రకటనలు లేదా Advertising చేయడానికి గూగుల్ తమ యొక్క బ్లాగ్ మరియు కమ్యూనిటీలలో సలహాలు ఇస్తుంది. ఇవి అనుసరించడం మంచిది.

వీడియో Creation

మీ brand పై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచడానికి వీడియో క్రియేషన్ సహాయపడుతుంది. Regular గా వీడియోస్ క్రియేట్ చేస్తూ మీ కంపెనీ యొక్క ఇమేజ్ ను పెంచవచ్చు. అలాగే ఈ వీడియోస్ Ad campaigns లో కూడా ప్రచారం చేయవచ్చు.

ఇమెయిల్ మార్కెటింగ్

తక్కువ ధరతో ఎక్కువ మందిని reach అవ్వాలంటే ఇదొక strategy. అయితే Email Marketing ఎంత వరకు సహాయ పడుతుందో చెప్పలేం.

బ్లాగ్స్/ Blogging

మీరు బిజినెస్ కాకుండా సొంతగా ఒక వెబ్సైటు/ బ్లాగ్ మొదలు పెట్టాలి అనుకుంటే initial గా ఎక్కువ శ్రమ అవసరం లేదు, కానీ ఓపిక అవసరం. మీరు ఎంచుకున్న Niche లో ఎన్ని బ్లాగ్స్ వున్నాయి, competition ఎలా వుంది ఇవన్నీ తెలుసుకోవాలి.

Read: Search Engine Optimization In Telugu

Leave a Comment