Wife and Husband Quotes in Telugu 2022: Having a husband and a wife is like having a best friend for the rest of your life. Everyone’s rights and standing are on an even playing field. Their home should be run as a team, with everyone pitching in to help out when needed. They should support and encourage one another in their endeavors, whether it’s in the realm of politics, the workplace, or academics. Here in this article, you will get the best Wife and Husband relationship quotes.
భార్యాభర్తల అనుబంధం: పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్య అనుబంధం ఎంత బాగానే ఉన్నా.. ఇబ్బందులు, సమస్యలు, గొడవలు రావటం సహజం. ప్రతి ఒక్కరికి వారి స్వంత అభిప్రాయాలు ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఏది జరిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే భవిష్యత్తును కలిసి ఎదుర్కోవడం.
భార్య భర్తలో సగం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకే జీవితాన్ని తమ జీవితకాలం గడుపుతారు; వారు ఇద్దరు సన్నిహిత సహచరులు. ప్రతి ఒక్కరికి హక్కులు మరియు హోదాలు సమానంగా ఉంటాయి. వారు కలిసి పని చేయాలి మరియు ఇంటి వ్యవహారాలను కలిసి నిర్వహించాలి.
రాజకీయాలలో, పనిలో మరియు చదువులో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, మరియు సహాయం చేసుకోవాలి. రోజువారీ జీవితంలో, వారు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి మరియు శ్రద్ధ చూపాలి. వారి తల్లిదండ్రుల విషయానికొస్తే, వారి సంరక్షణ బాధ్యతను ఇరువర్గాలు భరించాలి.
భార్య భర్తల పిల్లల సంరక్షణ మరియు విద్యకు సంబంధించి, రెండు వైపులా వారి బాధ్యతలను నిర్వర్తించాలి. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ మరియు ఉమ్మడి పురోభివృద్ధి , మరియు స్ఫూర్తితో భార్యాభర్తలు ఉండాలి, తద్వారా భార్యాభర్తల మధ్య కొత్త బంధాన్ని వ్యక్తపరుస్తుంది. భార్యాభర్తల మధ్య ఈ రకమైన సంబంధాలు నిరంతరం ఇద్దరి మధ్య భావాలను పెంచుతాయి మరియు వారి జీవితాలను మరింత ఆదర్శవంతంగా మారుస్తాయి.
అందలం ఎక్కించమని ఏ భార్య కోరుకోదు
అందరిలో చులకన చెయ్యొద్దు అని మాత్రమే కోరుకుంటుంది.
ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం
కేవలం బార్యభర్తల బంధం ఒక్కటే ..
స్త్రీ పుట్టింట్లో 20 సంవత్సరాలు
మాత్రమే గడుపుతుంది
అత్తింట్లో పూర్తి జీవితం గడపాలి
అలాంటి ఇల్లు ఆమెకు
గుడి కాకపోయినా
పర్లేదు కానీ జైలు కాకూడదు
ఒక స్త్రీ ఎంత గొప్పగా పెరిగినా
ఆమె అదృష్టం మరియు దురదృష్టం
తెలిసేది ఆమె పెళ్లి తరవాతే
తల్లితండ్రులు ముఖ్యమే కానీ
వారి కోసం భార్యను వదులుకోవద్దు
ఎందుకంటే నీకోసం తను
తల్లితండ్రులను వదిలేసి వచ్చింది
కట్నాలు, కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి
కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి
అబద్ధం: భార్యాభర్తలు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటే, అది వారి సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. వారి వైవాహిక జీవితంలో చీలిక ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో, వారి భాగస్వామిపై నమ్మకం పోతుంది. భార్యాభర్తల మధ్య సంబంధంలో అనుమానం చోటు చేసుకుంటుంది. అప్పుడు భార్యభర్తల మధ్య సంబంధంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
నిప్పులో నెయ్యి వేస్తే.. నిప్పు ఎలా పెరిగి.. ఎటువంటి కీడునైనా చేయగలదు. అదే విధంగా కోపంలో ఉన్న వ్యక్తికి మరింత కోపం పెరిగేలా చేయడం ద్వారా ఆ వ్యక్తికీ మరింత కోపం పెరుగుతుంది. తన సమతుల్యతను కోల్పోయి.. తనతో పాటు.. ఇతరుల కూడా హాని కలిగేలా నిర్ణయాలను తీసుకంటారు.
రహస్యాలను పంచుకోవడం: భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలలో పరిధులుంటాయి. ఎవరి రహస్యాలు వారి దగ్గర మాత్రమే ఉండాలి. భార్యాభర్తలు తమ రహస్య విషయాలను మరొకరితో పంచుకుంటే.. అవి జీవిత భాగస్వామిని కూడా బాధపెడతాయి. అప్పుడు భార్యాభర్తల సంబంధాన్ని బలహీనపరుస్తుంది. తగాదాలకు దారితీస్తుంది.
ఒకరినొకరు కించపరచుకోవడం: భార్యాభర్తల్లో ఎవరైనా చిన్న చిన్న విషయాలను పెద్దది చేసినా ఆ ప్రభావం భార్యాభర్తల బంధంపై పడుతుంది. ఏ విషయంలో భాగస్వామిని కించపరిచినా.. సంబంధం బలహీనపడుతుంది. కొన్నిసార్లు బంధం కూడా తెగిపోవచ్చు. ఏ సంబంధంలోనైనా పరస్పర గౌరవం చాలా ముఖ్యం.
మూడవ వ్యక్తి: భార్యాభర్తలిద్దరూ తమ సంబంధాన్ని పూర్తి నిజాయితీ, చిత్తశుద్ధితో కొనసాగించాలి. దంపతుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశిస్తే.. ఈ సంబంధం ఎక్కువ కాలం కొనసాగదు. అంతేకాదు దాని ముగింపు చాలా చెడుగా ముగిసే అవకాశం ఉంది.
These are the best Husband and Wife quotes, share with your loved ones and make the relationship stronger.
Also Read: