పోలవరం ప్రాజెక్టు పూర్తి వివరాలు: చరిత్ర, శంకుస్థాపన, నిర్మాణం

పోలవరం ప్రాజెక్టు పూర్తి వివరాలు: చరిత్ర, శంకుస్థాపన, నిర్మాణం

పోలవరం ప్రాజెక్టు పూర్తి వివరాలు (చరిత్ర, శంకుస్థాపన, నిర్మాణం): ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వందలాది మంది నిపుణులు, ఇంజనీర్లు పర్యవేక్షణలోజరుగుతుంది. వేలాది మంది కార్మికుల శ్రమైక్య సౌందర్యంతో పాటు ఆధునిక యంత్ర సామగ్రి, వేలాది టిప్పర్లు, లారీలు, యంత్రాల రణగొణ ధ్వనుల మధ్య ఓ ప్రపంచ అద్భుత నిర్మాణంగా పోలవరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

Polavaram Project, is an underconstruction multi-purpose irrigation project on the Godavari River in the West Godavari District and East Godavari District in Andhra Pradesh. The project has been accorded national project status by the Union Government of India.

polavaram project full details history, construction

తెలుగు రాష్ట్రాలలో మనం ఎక్కువగా ఉపయోగించుకునే నీరు కృష్ణా నది నుంచే వస్తుంది. దీనికీ నాగార్జున సాగర్ లాంటి పెద్ద డ్యాం మనకు ఉండటం ముఖ్య కారణం. అయితే మరో జీవ నదిగా చెప్పుకునే గోదావరి నీటిని మాత్రం మనం ఎక్కువగా ఉపయోగించుకోలేక పోతున్నాం. తద్వారా సంవత్సరానికి 30 వేళ టీఎంసీల గోదావరి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. దీనిని గమనించిన కొంతమంది మేధావులు ఎలా అయినా ఈ నీటిని కరువు ప్రాంతాలకు మళ్లించి అక్కడి భూములను సశైశామలం చేయాలని పోలవరం ప్రాజెక్టును తలబెట్టారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో నదుల అనుసంధానం తేలిక అవుతుందని వారి అభిప్రాయం.

పోలవరం ప్రాజెక్టు పూర్తి వివరాలు: చరిత్ర, శంకుస్థాపన, నిర్మాణం

ధవళేశ్వరం ప్రాజెక్టు 50 కిలో మీటర్ల దూరంలో ఎగువన ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతుంది. దీనికి మొదటిగా రామపాద సాగర్ అని పేరు పెట్టారు ఎందుకంటే డ్యాం లో స్టోర్ అయ్యే నీరు భద్రాచలం శ్రీరాముని దేవాలయంను తాకుతాయని. అయితే చాలా దశాబ్దాల తరువాత రామపాద సాగర్ ప్రాజెక్టు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మార్చుకుని 2004 లో పునాది వేసుకుంది. 1941 లో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 6.5 కోట్లుగా అంచనా వేస్తే అది 2004 కు వచ్చే సరికి 8200 కోట్లకు పెరిగింది.

2004 లో పనులు ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2006లో పనులు ఆపి వేయవలసి వచ్చింది. దీనికి కారణం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు రాకపోవడం. అయితే 2009 లో ఈ ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతుల వచ్చాయి. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర రెడ్డి హఠాత్మరణంతో రాజకీయ సమీకరణాలు మారి ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది. 2014 లో భారత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది. దీని ద్వారా ప్రాజెక్ట్ కట్టడానికి అవసరమైన 90% నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది.

2014 రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో పోల‌వ‌రం గురించి అప్ప‌టి రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ మాట్లాడుతూ..పూర్తి బాధ్య‌త కేంద్ర‌మే తీసుకుంటుంద‌ని ప్ర‌క‌టించారు. 90 శాతం, 10 శాతం ఉంటుంద‌ని, 90 శాతం కేంద్ర‌మే భ‌రించాల‌ని ఓ చ‌ట్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టు చరిత్ర: History of Polavaram Project

ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును 1942లో అప్ప‌టి చీప్ ఇంజ‌నీర్ వెంక‌ట‌కృష్ణ య్యార్ అనే వ్య‌క్తి 170 అడుగులకు రూపొందించారు. ఆ త‌రువాత 180 అడుగుల‌కు, ఆ త‌రువాత 200 అడుగుల‌కు మొత్తానికి 830 టీఎంసీల స్టోరేజీతో చేయాల‌ని ఒక ప్ర‌తిపాద‌న చేశారు. అప్ప‌ట్లో ఒక కంటెన్సికీ ఇచ్చారు. 1956 త‌రువాత గొడ‌వ‌లు జ‌ర‌గ‌డంతో ప‌క్క‌న పెట్టారు. 1980 లో పోలవరం ప్రాజెక్ట్ కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పి. అంజయ్య అప్ప‌ట్లో పునాది వేశారు. త‌రువాత సుదీర్ఘ పాద‌యాత్రలో 2004లో డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎం అయ్యాక 70 ఏళ్ల త‌రుఆత 8.11.2004లో పోల‌వ‌రానికి ఫౌండేష‌న్ వేశారు. 2005లో ప‌నులు ప్రారంభించారు.

శంకుస్థాపన

1980 లో పోలవరం ప్రాజెక్ట్ కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి పి. అంజయ్య శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత దీని గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. 2004లో వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాంతాన్ని సందర్శించి అప్పటి శంకుస్థాపనకు పునర్జీవం పోశారు. పోలవరం నిర్మాణంలో ఉంది మరియు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలంలోని రామాయపేట గ్రామానికి సమీపంలో గోదావరి నదిపై ఉంది. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలోని అన్ని నీటి అవసరాలకు పరిష్కారంగా ఉంటుంది.

ఉపయోగాలు

  • ప్రాజెక్ట్ రిజర్వాయర్ కాలువ యొక్క పూర్తి సరఫరా స్థాయి ద్వారా 23,20,000 ఎకరాలకు నీరు అందుతుంది
  • గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నీటిని కృష్ణ మరియు ఇతర నదులకు మళ్లించడానికి సహాయపడుతుంది.
  • ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాన్ని శాశ్వతంగా కరువు రహితంగా చేస్తుంది.
  • పోలవరం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా A.P లోని 13 జిల్లాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్ యొక్క ప్రధాన భాగాలు:

  • స్పిల్‌వే
  • కాఫర్ డ్యామ్
  • ECRF డ్యామ్ (ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్) & డయాఫ్రాగమ్ గోడ

తుది దశకు చేరుకుంటున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటోంది. 2021 చివరి నాటికి ప్రాజెక్టును ఎట్టి పరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ పనులు పూర్తిచేస్తోంది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 42.5 మీటర్ల ఎత్తులో కాపర్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు. 2021 లో స్పిల్‌వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్పిల్‌ వే చానల్‌ పనులు పూర్తయ్యాయి.

కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా థెరపీ: Click Here

Read: AP Spandana Toll Free Number

Leave a Comment