SEO In Telugu: సెర్చ్ ఇంజిన్ ఆప్టిమిజేషన్ గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. ఇది Digital Marketing లో వచ్చే ఒక ముఖ్యమైన టాపిక్. Search Engine Optimization చేయడం ద్వారా మన బ్లాగ్ Search Engines లో ముందు వరుసలోకి రావడానికి దోహద పడుతుంది. అయితే ఈ పద్ధతి చాలా పాతదే అయినా దీనిలోని ప్రక్రియలు మారుతూ వస్తున్నాయి. కాలానుసారంగా technology లో మార్పులు వచ్చే కొద్ది ఇందులో కూడా కొత్త topics జతవుతా వున్నాయి. అసలు Search Engine Optimization (SEO) అంటే ఏమిటి? అందులో ఏమి టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
Search Engine Optimization (SEO) అంటే ఏమిటి? | SEO In Telugu
మనం ఒక వెబ్సైటు లేదా బ్లాగ్ మొదలుపెట్టాలి అనుకుంటే, అందులోని మెళుకువలు తెలుసుకోవడం తప్పనిసరి. మనం ఏ విధమైన Advertisement చేయకుండా SEO ద్వారా మన Business యొక్క సమాచారాన్ని ఇతరులకు తెలియచేయవచ్చు. అయితే వెబ్‌సైట్ యొక్క Quality, అందరికీ అర్ధమయ్యే విధానం కలిగి వున్న content ఉండటమే SEO ప్రధాన సూత్రం.
Search Engine అంటే ఏమిటి?
Online లో శోధకులు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదా వారి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడే వెబ్సైటులను సెర్చ్ ఇంజిన్స్ గుర్తిస్తాయి. ప్రస్తుతం 140 కు పైగా search engines ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వున్నాయి. అందులో బాగా popular అంటే Google Search Engine మాత్రమే.
ఉదాహరణ: గూగుల్, Yahoo, Yandex, Bing మొదలుగునవి..
What is SEO in Telugu?
SEO అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. SEO అనేది Google లేదా ఇతర Search Engines కు మన website లేదా Blog యొక్క సమాచారం కనుగొనడానికి ఉపయోగించే పద్దతి. Search Engine Optimization చేయడం ద్వారా, Search Engines కు మనం వ్రాసే articles సమాచారం దేని గురించి అనేది అర్ధమౌతుంది. తద్వారా మన యొక్క వెబ్సైటు rank అవ్వడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది.
SEO యొక్క మూడు రకాలు: on-page SEO, off-page SEO and technical SEO
మీ SEO strategy వ్యూహాన్ని ఇలా విభజించడం ద్వారా, దానిని అమలు చేయడం చాలా సులభం అవుతుంది.
On-Page SEO
On page SEO మీ వెబ్‌సైట్‌లోని కంటెంట్‌కు సంబంధించినది. వెబ్‌సైట్‌లో ప్రతి పోస్టును optimize చేయడానికి ఈ వ్యూహం సహాయపడుతుంది. On page SEO సెర్చ్ ఇంజన్లకు ప్రతి పోస్టు యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అది శోధకులు కనుగొనడానికి సహాయపడే మూలం.
Off-Page SEO
Off-Page SEO మీ వెబ్‌సైట్ ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా కలిగే సంబంధాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంటే వేరే ఒక వెబ్సైటు మీ వెబ్‌సైట్ యొక్క లింక్ కలిగి ఉంటే, మీ వెబ్సైటు Authority పెడుతుంది. అయితే ఆ Websites మన వెబ్సైటు యొక్క Niche కు సంబందించినదైతే ఎక్కువ ఫలితం దక్కుతుంది. తద్వారా సెర్చ్ ఇంజన్లు మీ వెబ్సైటును త్వరగా గుర్తిస్తాయి అలాగే Rank చేస్తాయి.
Technical SEO
టెక్నికల్ SEO మీ website design, స్పీడ్ మరియు ఇతర అంశాలపై ఆధారపడుతుంది. ఇది కూడా చాలా అవసరం. ఇందులో వచ్చే topics..
- Site speed
- Mobile-friendliness
- Site architecture and Design
- Structured data/ Schema
- User Friendliness