Bhagavad Gita Quotes in Telugu 2022

Bhagavad Gita Quotes in Telugu 2022: The Gita is a 700-verse Hindu scripture that is part of the epic Mahabharata (chapters 23–40 of book 6 of the Mahabharata called the Bhishma Parva), dated to the second half of the first millennium BCE and is typical of the Hindu synthesis. According to Hinduism, it is regarded as a sacred text of great importance.

Bhagavad Gita Quotes in Telugu 2022

Bhagavad Gita Quotes in Telugu 2022

నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు..
ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయు..
అప్పుడు ప్రపంచంలోనే ఏ బాధ మీ ధరి చేరదు..!! – భగవద్గీత

కుండలు వేరైన మట్టి ఒక్కటే
నగలు వేరైన బంగారం ఒక్కటే
ఆవులు వేరైనా పాలు ఒక్కటే
అల్లాగే దేహాలు వేరైన పరమాత్మ ఒక్కటే
అని తెలుసుకున్న వాడే జ్ఞాని – భగవద్గీత

మన మనసును మనం అదుపు చేసుకోలేకపోతే
అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది – భగవద్గీత

చావు పుట్టుకలు సహజం
ఎవరూ తప్పించుకోలేరు
వివేకవంతులు వాటి గురించి ఆలోచించారు – భగవద్గీత

అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే కనుక
ఒకరిని ద్వేషించడం అనేది..
తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది.. – భగవద్గీత

ఎవరైతే అన్నీ పరిస్థితులలో
మమకారం, ఆసక్తి లేకుండా ఉంటాడో..
సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు
కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో..
అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని – భగవద్గీత

మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి
తన మనస్సే బంధువు..
మనస్సును జయించలేని వాడికి
మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది – భగవద్గీత 6.6

మరణం అనివార్యం
పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు
ఎవరూ అమరులు కాదు – భగవద్గీత

భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టే పాట కాదు..
మనం శవంగా మారేలోపు జీవితపరమార్ధాన్ని తెలియజేసే
దివ్య జ్ఞానోపదేశం – భగవద్గీత

కోపం మనసులో కాదు
మాటలో మాత్రమే ఉండాలి..
ప్రేమ మాటలో మాత్రమే కాదు
మనసులోనూ ఉండాలి.. – భగవద్గీత

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు కాని.. వాటి ఫలితాలయందు కాదు..!! – భగవద్గీత

 

Bhagavad Gita Quotes 2022

* పని చేయడం మన బాధ్యత

దానికి ఫలితం ఆశించడం నీ బాధ్యత కాదు

అది దేవుని బాధ్యత

పని పనిచేసుకుంటూ వెళ్ళిపో ఫలితం వస్తుంది….

* లోకంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి కానీ కొందరు మాత్రమే వాటికి అర్హులు

* క్రోధం అవివేకం నుండి ఉత్పన్నమవుతుంది

* అందరూ పురుషార్థమే చేస్తారు

రైతు తన పొలంలో రేయింబవళ్ళు

కొందరు తమ వ్యాపారాన్ని పురుషార్ధం చేస్తారు

కొందరు తమ పదవుల్ని దురోపాయోగించడమే పురుషార్ధం అనుకుంటారు

ఎన్ని చేసినా మళ్ళీ మనం ఖాళీ చేతులతో వెళ్లాల్సిందే

ఆత్మదర్శనం నిజమైనప్పుడు పురుషార్ధం

*  ఎవరైతే సుఖదుఃఖాలను సమానంగా అర్థం చేసుకోగలరో

అతను మృత్యువుకంటే అతీతమైన అమృతత్వాన్ని పొందడానికి యోగ్యుడు అవుతాడు

* చాలామంది మనం చేస్తున్న పని గురించి ఏమనుకుంటారో

అని అనుకుంటారు అలాంటి భావన వలన కూడా ప్రేరణ చెందేలా చేస్తుంది…

 

* కొందరు నీ ఎదుగుదలను నిందిస్తూ చెప్పలేని మాటలు అంటారు

ఒక తప్పు చేస్తే  చాలు 4 దారుల నుండి నిందలు, మాటలు కురిపిస్తారు..

ఇంతకన్నా దుఃఖం ఇంకా ఏమైనా ఉంటుందా కానీ

నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో…

* మానవులందరూ ఈశ్వరుని సంతానమే

*  మనుషులు రెండు రకాలు

దేవతలు మంచి గుణాలు

అసురులు చెడు గుణాలు

 

*  అన్ని కోరికలు ఆ ఈశ్వరుడు ద్వారానే తీరుతాయి

* ఆత్మ మాత్రమే సత్యం, సనాతనం

*  గీత మాత్రమే శాస్త్రం…

* శరీరం కంటే అతీతమైనది ఇంద్రియాలు

కంటే అతీతమైనది మనసు

మనసు కంటే అతీతమైనది బుద్ధి

బుద్ధి కంటే అతీతమైనది స్వరూపం

నువ్వు దాని వలన మాత్రమే ప్రేరణ పొందగలుగుతావు..

* కమలం బురదలో ఉంటుంది కానీ

ఒక్క చుక్క నీరు  కూడా నిలవలేదు అలాగే

మనం కూడా మన ఎంత చెడ్డ వాళ్ళ చుట్టూ ఉన్న మనం లొంగ  కూడదు

* ఎవరి మనస్థితి సమత్వంలో  స్థిరమై ఉంటుందో

అలాంటి పురుషులు జీవించి ఉన్న అవస్థలోనే సమస్త ప్రపంచాన్ని గెలుస్తారు

*  జీవాత్మ స్వయంగా తనకు మిత్రుడు మరియు శతృవు కూడా…

* చలి – వేడి, సుఖం – దుఃఖం, మనం – అవమానం ఎవరి అంతఃకరణం యొక్క ప్రవృత్తులు శంతమై ఉంటాయో అలాంటి స్వాధీనమైన ఆత్మ గల పురుషులలో పరమాత్ముడు ఎల్లప్పుడు స్థితుడై ఉంటాడు..

*  తీవ్ర ప్రయత్నం చేయు వాడు ఎవరైనా సరేగానీ

శిథిల  ప్రయత్నం చేసేవాడు మాత్రం గ్రహస్తుడే అవుతాడు

* సమస్త జగత్తు యొక్క ఉత్పత్తి నలో నుండే అవుతుంది

ప్రళయం కూడా నలో నుండి అవుతుంది..

These are the best Bhagavad Gita Quotes share these life-changing quotes with your family and loved ones.

Also Read:

Leave a Comment