Warren Buffett Quotes in Telugu | వారెన్ బఫెట్

Warren Buffett Quotes in Telugu | వారెన్ బఫెట్

Warren Buffett Quotes in Telugu: వారెన్ బఫెట్ అసలు పేరు వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. బఫెట్ నెబ్రాస్కాలోని ఒమాహ అనే నగరంలో జన్మించాడు. బఫెట్ కొలంబియా బిజినెస్ స్కూల్లో తన బిజినెస్ డిగ్రీని పొందాడు. రోజులో 80% స‌మ‌యం ఆయ‌న చ‌దివేందుకు కేటాయిస్తారు. వారెన్ బ‌ఫెట్ పెట్టుబ‌డుల్లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించారు. ఒక విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌గానే కాకుండా దాతృత్వంలోనూ దిట్ట అని ఆయ‌న నిరూపించుకున్నారు. ఆయ‌న గురించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు మీ కోసం.

warren buffett quotes in telugu

Warren Buffett is one of the world’s richest person, Interesting fact is he made 99% of his wealth after the age of 60 years. In this article, we will explain some of the interesting facts and quotes behind his success story. The quotes will showcase the Ideology of Warren Buffett to become world riches person.

Warren Buffett Quotes in Telugu | వారెన్ బఫెట్

అతను ఏడేళ్ల వయసులో చదివిన వెయ్యి డాలర్లు సంపాదించడానికి వెయ్యి మార్గాలు అనే పుస్తకం ద్వారా అతను డబ్బుపై ఇష్టాన్నిపెంచుకున్నాడు. అలా డబ్బు సంపాదించడం కోసం కోకా-కోలా బాటిల్స్ అమ్మడం,చూయింగ్ గమ్స్ అమ్మడం,న్యూస్ మాగజైన్ వేయడం వంటివి చేసేవాడు. అలా తన పదకొండేళ్ల వయసులో తన సోదరి డోరిస్ బఫెట్ తో కలిసి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజిలో ఉన్న సిటీస్ సర్వీస్ లో షేర్స్ కొంటాడు. బఫెట్ కొన్ని రోజులకు తను దాచుకున్న డబ్బుతో పొలాన్ని కొనుకుంటాడు. అలా అతని 14 ఏళ్ళ వయసులో తన మొదటి ఇన్ కమ్ టాక్స్ కట్టాడు.

వారెన్ బఫెట్ ఆదాయ మార్గాలు

  • చాలా చిన్న వ‌య‌సు 11 సంవ‌త్స‌రాల‌ప్పుడు ఆయ‌న షేర్ల‌ను కొన‌డం మొద‌లుపెట్టాడు
  • వారెన్ బ‌ఫెట్ 16 ఏళ్ల వ‌య‌సు నాటికి వివిధ వ్యాపారాల‌ను నెల‌కొల్ప‌డం, పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా 53,000 డాల‌ర్లు సంపాదించారు
  • ఒక్కోసారి బ‌ఫెట్‌తో లంచ్‌కు సంబంధించి బిడ్ నిర్వ‌హిస్తే అది 3.4 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి. 2000 సంవ‌త్స‌రం నుంచి నిధుల సేక‌ర‌ణ కోసం ఈబేలో ఈ త‌ర‌హా ఈ-లంచ్ బిడ్డింగ్ జ‌రుపుతున్నారు.
  • 2013లో స‌గ‌టున రోజుకు 37 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించడు వారెన్ బ‌ఫెట్
  • ఆయ‌న‌కు 52 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు ఉన్న సంప‌ద విలువ 376 మిలియ‌న్ డాల‌ర్లు. 60 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న సంపద విలువ 3.8 బిలియ‌న్ డాల‌ర్లు కాగా ప్ర‌స్తుతం 77.3 బిలియ‌న్ డాల‌ర్లుకు పైగా ఉంది.

Warren Buffett Quotes in Telugu

మొట్ట‌మొద‌టిసారి చాలా చిన్న వ‌య‌సు 11 సంవ‌త్స‌రాల‌ప్పుడు ఆయ‌న షేర్ల‌ను కొన‌డం మొద‌లుపెట్టాడు. మామూలుగా ఆ వ‌య‌సులో అంద‌రూ కామిక్స్ బుక్స్ చ‌ద‌వ‌డం, బ‌యట ఇష్ట‌మొచ్చిన ఆట‌లు ఆడుకుంటూ ఉండ‌గా ఆయ‌న విభిన్నంగా ఆలోచించారు. Warren Buffett Quotes in Telugu మీ కోసం.

  • మీకు అవసరం లేని వస్తువులను కొంటూ పోతే, కొద్ది రోజులలో అవసరమైన వస్తువులను అమ్ముకునే పరిస్థితి నెలకొంటుంది.
  • ఖర్చు చేసాక మిగిలే మొత్తాన్ని ఆదా చేయకూడదు, ముందు కొంత మొత్తాన్ని ఆదా చేసాక మిగిలినది ఖర్చు పెట్టుకోండి.
  • ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకండి. ప్రత్యామ్నాయంగా మరో ఆదాయ మార్గం కోసం పెట్టుబడులు పెట్టండి.
  • నది లోతు కొలవడానికి ఒక కాలిని నీటిలో పెట్టాలి, అంతేకానీ పూర్తిగా దిగకూడదు.
  • అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకుండా వేర్వేరు బుట్టలలో పెట్టడం మంచిది.
  • నిజాయితీ అనేది అత్యంత ఖరీదైన బహుమతి. చౌకబారు వ్యక్తుల నుండి దీనిని ఆశించకండి.
  • ప్రణాళికతో వున్న తెలివితక్కువ వాడు ఏ ప్రణాళికా లేని అతి తెలివైన వాడిని కూడా ఓడించగలడు.
  • నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియనప్పుడు నీకు ప్రమాదం ఎదురౌతుంది.
  • నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత ఎక్కువ సంపాదిస్తావ్

Read: 

Leave a Comment